రిలయన్స్ jio కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎయిర్టెల్
జియో కన్నా ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ స్పీడ్ చాలా వేగవంతంగా ఉందని ట్రాయ్ రిపోర్ట్.
గతకొంత కాలంగా టెలికాం రంగం లో తనదే హవాగా దూసుకు పోతున్న jio మొట్టమొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది . అదేమిటంటే ట్రాయ్ తాజా నివేదికల ప్రకారం జిఓ ఇంటర్నెట్ స్పీడ్ తో పోలిస్తే ఎయిర్టెల్ చాలా వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ ను అందిస్తుందని తెలిపింది. జనవరిలో భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ సెకనుకు 8.42 మెగాబైట్స్‌గా (8.42 ఎంబీపీఎస్) నమోదయ్యింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ఎయిర్టెల్ డౌన్‌లోడ్ స్పీడ్ 4.68 ఎంబీపీఎస్‌గా ఉంది. అంటే లాస్ట్ మంథ్ చూస్తే ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ దాదాపు గరిష్టముగా పెరిగిందనే చెప్పాలి. రిలయన్స్ జియో విషయానికి వస్తే ఈ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ 8.34 ఎంబీపీఎస్‌గా రికార్డు అయ్యింది. డిసెంబర్‌లో దీని డౌన్‌లోడ్ స్పీడ్ గరిష్టంగా 18.14 ఎంబీపీఎస్‌గా ఉండటం షాక్ కు గురయ్యే విషయం. అంటే డిసెంబర్ తో పోలిస్తే రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ సగానికిపైగా తగ్గిపోయింది . లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి జనవరి వరకు చూస్తే ఎయిర్‌టెల్ మూడు సార్లు డౌన్‌లోడ్ స్పీడ్ అంశంలో టాప్ ప్లేస్ లో ఉన్నట్లు ట్రాయ్ తాజా నివేదిక .