భారతీ ఎయిర్టెల్ మొబైల్ ఫోన్ మేకర్ సిలికాన్ తో కలిసి4 జి స్మార్ట్ఫోన్ ని 1,349 రూపాయల తో ప్రారంభించింది.
నాలుగు అంగుళాల టచ్స్క్రీన్, డ్యూయల్ సిమ్ స్లాట్లు, ఎఫ్ఎమ్ రేడియో తో 'Celkon Smart 4G'(మార్కెట్లో రూ. 3,500 ధర) అందుబాటులో ఉంది. ఇది ఒక ఆండ్రాయిడ్ ఆధారిత 4G స్మార్ట్ఫోన్, ఇది YouTube ప్లే స్టోర్ అన్ని సేవలను అందిస్తుంది, YouTube, Facebook మరియు వాట్స్ యాప్ కలిగి వుంది .ఈ డివైస్ మైఎయిర్టెల్ యాప్ , వింగ్ మ్యూజిక్ మరియు ఎయిర్టెల్ టీవీ యాప్ తో ప్రీలోడెడ్ అయి వస్తుంది. ఎయిర్టెల్ ఈ స్మార్ట్ఫోన్ను రూ .169 నెలవారీ ప్యాక్ తో ప్రారంభించింది, ఇది చాలా కాలింగ్ మరియు డేటాను అందిస్తుంది.భారతీయ ఎయిర్టెల్ డైరెక్టర్ (కన్స్యూమర్ బిజినెస్), చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజ్ పుడిపేది మాట్లాడుతూ, స్మార్ట్ఫోన్ ఆప్షన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, తక్కువ ఖర్చుతో కూడిన డివైసెస్ లో ఒక ఓపెన్ ఎకోసిస్టమ్ ని రూపొందించాలని, మేము సిలికన్ భాగస్వామ్యాన్ని కలిగి వున్నందుకు సంతోషంగా ఉన్నాము " అని తెలిపారు . ఈ ఆఫర్ పొందడానికి, కస్టమర్ 2,849 రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలిసి ఉంటుంది మరియు 36 నెలల వరకు నెలకు రూ .169 రీఛార్జ్ రీఛార్జ్ చేయవలసి ఉంది. 18 నెలల తరువాత, వినియోగదారుడు రూ .500 క్యాష్ రిఫండ్ అందుకుంటారు మరియు 36 నెలల తరువాత 1,000 రూపాయల క్యాష్ రిఫండ్ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా కస్టమర్ మొత్తం రూ .1,500 ల లాభం పొందుతాడు .