ఎయిర్టెల్ 4G అతిపెద్ద డీల్
రిలయన్స్ జియో తర్వాత ఇండియా మొత్తానికి 4జీ నెట్‌వర్క్ ఉన్న కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్ నెంబర్ 1 గా నిలవనుంది .
ఫాస్టెస్ట్ నెట్వర్క్ గా పేరొందుతున్న ఎయిర్‌టెల్ మరో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇండియాలో 4జీ ఇంటర్నెట్ మరింత ఫాస్ట్ గా యూజర్స్ కి అందించాలన్న సదుర్దేశం తో ప్రముఖ దేశీయ బ్రాడ్‌బాండ్ సేవల సంస్థ టికోనా ను తన సొంతం చేసుకోనుంది. రూ.1600కోట్లతో టికోనా 4జీ బిజినెస్‌ను తన స్వాధీనం లోకి తెచ్చుకోనుంది. .
దాదాపు రూ.1600కోట్లుతో టికోనా 4జీ డిజిటల్ నెట్‌వర్క్ బిజినెస్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్ టెల్ ఒక న్యూస్ ద్వారా తెలిపింది.
ఈ డీల్ ద్వారా టికోనా బ్రాడ్ బాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రం మరియు , ఐదు టెలికాం సర్కిల్స్‌లో 350 సైట్లు తమ స్వాధీనం లోకి రానున్నట్లు ఎయిర్టెల్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో సగర్వంగా తెలిపింది.
టికోనా ను కొనటం ద్వారా దేశంలో రిలయన్స్ జియో తర్వాత ఇండియా మొత్తానికి 4జీ నెట్‌వర్క్ ఉన్న కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్ నెంబర్ 1 గా నిలవనుంది . ఈ భారీ డీల్ తరువాత యూజర్స్ కి మరింత వేగవంతమైన వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ ఇస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ గోపాల్ విట్టల్ చెప్పారు.