గత ఏడాది నుంచి రిలయన్స్ జీయో 4 జి సర్వీసును ప్రారంభించినందున, అన్ని భారతీయ టెలికాం కంపెనీలు చవకైన డేటా మరియు ఉచిత వాయిస్ కాల్స్ అందించడానికి పోటీ పడ్డాయి.
మరొక వైపు, రిలయన్స్ జియో ప్రయాణం ఒక అద్భుత కథ అని చెప్పవచ్చు . ప్రారంభించినప్పటి నుంచి, 130 మిలియన్ల మంది చందాదారులను ముకేష్ అంబానీ జోడించగా, దేశంలో డేటా వినియోగం పెరిగింది. భారతీయ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం జియో వల్ల భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యూలార్, వొడాఫోన్ ఇండియాలు చాలా దెబ్బ తిన్నాయి .భారతి ఎయిర్టెల్ మినహా, అన్ని కంపెనీల ల యాక్టీవ్ చందాదారుల సంఖ్య తగ్గింది , ఎయిర్టెల్ ఈ ఏడాది 23 మిలియన్ల VLR లు (విజిటర్ లొకేషన్ రిజిస్టర్ ) ను జోడించింది. ఐడియా సెల్యూలార్, వొడాఫోన్లలో 11.9 మిలియన్లు, 5.1 మిలియన్ల విఎల్ఆర్ చందాదారులు ఉన్నారు. గత మూడు నెలల్లో ఈ రెండు ఆపరేటర్ల చందాదారుల సంఖ్య తగ్గింది .