JIO నుంచి చౌకైన కిరాణా సిద్ధం.

JIO  నుంచి చౌకైన కిరాణా సిద్ధం.

రిలయన్స్ జియో తో ముఖేష్ అంబానీ మరో పెద్ద పందెం పెట్టాడు. భారతదేశంలో రిటైల్ కంపెనీలు దృష్టి పెడుతుండగా, అంబానీ భారతదేసం పై  పూర్తి దృష్టి పెట్టారు. అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ మద్య జరుగుతున్న  ఇ-కామర్స్ యుద్ధంలో అంబానీ చిన్న కిరాణా దుకాణాలతో తన వినియోగదారులకు చౌకైన కిరాణాను అందించటానికి ప్రణాళిక వేశారు.

అంబానీ తన రిలయన్స్ జీయో కస్టమర్లతో తయారీదారులు మరియు కిరాణా దుకాణాలను లింక్ చేయాలని అనుకుంటున్నాడు. రిలయన్స్ జీయో వినియోగదారులకు కిరాణా స్టోర్స్ నుండి డిస్కౌంట్ రేట్లో సామాను కొనుగోలు చేయడానికి డిజిటల్ కూపన్లను  అందిస్తుంది.

దీని కోసం  రిలయన్స్ జీయో తన డబ్బు ఖర్చు చేయదు.తాను కేవలం  వినియోగదారుల లాభం కోసం తయారీదారు మరియు కిరాణా దుకాణం మధ్య మధ్యవర్తి పాత్రను పోషిస్తాడు.ఇది బ్రాండ్ కి  ఉచిత ప్రమోషన్ ఇస్తుంది, అయితే కిరాణా స్టోర్స్  ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంటుంది. మరియు జియో కోసం కొత్త వినియోగదారులను అనుసంధానించటానికి  సమర్థవంతమైన మార్గంగా ఉంటుంది.

ముంబై, చెన్నై, అహ్మదాబాద్లలో ఈ ప్లాన్  యొక్క పైలట్ ప్రాజెక్టును నడుపుతోంది, వచ్చే ఏడాది ఈ ప్లాన్ ని  దేశవ్యాప్తంగా అమలు చేయనుంది. చిన్న కిరాణా స్టోర్స్  ఇ-కామర్స్ కంపెనీలంటే  భయపడుతున్నాయి, కానీ అంబానీ వారికి ఈ పెద్ద అవకాశాన్ని చూపిస్తున్నాడు . జియో నుండి చౌకైన డేటా  అంబానీకి పెద్ద మార్కెట్ ని  తెరిచింది. భారతదేశంలో $ 650 బిలియన్ల రిటైల్ పరిశ్రమలో E- కామర్స్ వాటా 3-4 శాతం మాత్రమే. ఆర్గనైజ్డ్ రిటైలర్లు కేవలం 8 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నారు. మిగిలి ఉన్న 88 శాతం చిన్న కిరాణా స్టోర్స్ లలో ఉంది. అంబానీ జియో ద్వారా  స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న మార్కెట్ ఇది.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo