సూర్యుని దగ్గర నుండి స్టడీ చెయ్యడానికి భారత్ చేప్పట్టిన అద్భుతమైన మిషన్ లో భాగంగా పంపిన Aditya-L1 అంతరిక్ష నౌక, అతిసమీపం నుండి భూమి మరియు చంద్రుని సెల్ఫీ ఫోటో ను భూమికి పంపింది. ఈ సెల్ఫీ వీడియో లో భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు ఒకే లైన్ లో కనిపించారు. ఈ అద్భుతాన్ని Aditya-L1 Selfie వీడియో రూపంలో చిత్రీకరించింది. సూర్యుని ను స్టడీ చెయ్యడానికి సరైన దూరమైన భూమి మరియు సూర్యుని యొక్క Lagrange Point 1 ను చేరుకొవడానికి చేస్తున్న ప్రయాణంలో ఈ అద్భుతాన్ని చిత్రీకరించింది.
Aditya-L1 సక్సెస్ ఫుల్ గా భూమి నుండి నింగికెగసింది మరియు గమ్య స్థానమైన Lagrange Point 1 ను చేరుకోవడానికి పయనిస్తోంది. ఇది Lagrange Point 1 ను చేరుకోవడానికి, ముందుగా 16 రోజులు భూమి బంధిత కక్షలో ఉంటుంది. ప్రస్తుతం ఈ భూమి బంధిత కక్షలో ఉన్న ఆదిత్య -L1 అంతరిక్ష నౌక ఈ అద్భుతాన్ని చిత్రీకరించి భూమి పైకి పంపింది.
Aditya-L1 పంపిన Selfie ఫోటో
Aditya-L1 పంపిన సెల్ఫీ వీడియోలో భూమి చుట్టూ తిరుగుతున్న భూమిని చూడవచ్చు. ఆదిత్య-L1 నౌక భూమి మరియు చంద్రుని వీడియోలు మరియు ఫోటోలను కూడా సంగ్రహించింది. ఇది 110 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆదిత్య-L1 అంతరిక్ష నౌక గమ్య స్థానాన్ని చేరుకుంటుంది.
చంద్రుని దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ ను నిలబెట్టిన చంద్రయాన్ – 3 సక్సెస్ తరువాత ISRO వెంటనే ఈ Aditya-L1 Mission ను సక్సెస్ ఫుల్ లాంచ్ చేసింది మరియు నిర్వీరామంగా పర్యవేక్షిస్తోంది. ఈ కొత్త మిషన్ సక్సెస్ తో భారత క్రాంతి మరింతా విరాజిల్లుతుంది.
ఆదిత్య-L1 అంతరిక్ష నౌక భూకక్ష్య నుండి 15 లక్షల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసి భూమి మరియు సూర్యుని యొక్క Lagrange Point 1 ను చేరుకుంటుంది. అయితే, ఇది భూమికి మరియు సూర్యునికి మధ్య ఉన్న దూరంలో కేవలం 15 మాత్రమే అని గుర్తుంచుకోండి. వాస్తవానికి, భూమికి మరియు సూర్యునికి మధ్య ఉన్న దూరం 150.77 మిలియన్ క్లియో మీటర్లు.
ఆదిత్య-L1 అంతరిక్ష నౌక ఈ Lagrange Point 1 చేరుకున్న తరువాత సూర్యుని ఉపరితలం పైన వున్నా వాతావరణాన్ని స్టడీ చేస్తుంది.