AdBlock ప్లస్ అనేది ఆండ్రాయిడ్ os కు మోస్ట్ వాంటెడ్ అప్లికేషన్. ఇది జనరల్ గా root అయిన ఫోన్లకు ఉపయోగపడుతుంది. ఫోన్ లో ఎక్కడైనా AD's ఉంటే వాటిని బ్లాక్ చేయటానికి ఇది పర్ఫెక్ట్ యాప్. క్రోమ్, మొజిల్లా వంటి డెస్క్ టాప్ బ్రౌజర్స్ కు కూడా extension రూపంలో అందుబాటులో ఉంది.
ఇప్పుడు లేటెస్ట్ గా ఐ os అండ్ ఆండ్రాయిడ్ os లకు కొత్తగా ఇంటర్నెట్ బ్రౌజర్ ను రిలీజ్ చేసింది. గూగల్ ప్లే స్టోర్ లో ఈ లింక్ లోకి వెళ్లి దీనిని డౌన్లోడ్ చేయగలరు. ios యూజర్స్ కు ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
అన్ని మొబైల్ బ్రౌజర్స్ లానే ఇది కూడా సేమ్. కాని native గా advertisements ను బ్లాక్ చేస్తుంది adblock ప్లస్ బ్రౌజర్. అఫిషియల్ బ్లాగ్ పోస్ట్ లో adblock చెప్పిన మాటలు ప్రకారం.. ఇది డేటా అండ్ బ్యాటరీ లైఫ్ ను ఆదా చేస్తుంది ads బ్లాక్ చేయటం వలన.
టోటల్ గా ఈ ads బ్లాక్ చేయటం వలన 20% బ్యాటరీ సేవ్ అవుతుంది అంట. అంతేకాక మాల్వేర్ domains మరియు trackers ను కూడా నిషేదిస్తుంది బ్రౌజర్. అయితే రియల్ టైమ్ యూసేజ్ లో ads కారణంగా pop అప్ పేజెస్ కుడా బ్లాక్ అవుతాయి. ఏదైనా డౌన్లోడ్ చేయటానికి ట్రై చేస్తే చాలు చాలా ad పేజెస్ వస్తుంటాయి ఎప్పుడూ. సో ఇది చాలా మంచి విషయం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు.
Adblock ప్లస్ మొదటిగా 2012 లో వచ్చింది. అయితే ఇది ads ను బ్లాక్ చేస్తుంది అని ప్లే స్టోర్ దీనిని ప్లే స్టోర్ నుండి తీసేసింది గూగల్ 2013 లో. బ్రౌజర్ బిటా వెర్షన్ ప్లే స్టోర్ లో may నెల నుండి ఉంది.
గూగల్ సైతం తన మొబైల్ క్రోమ్ బ్రౌజర్ లో డిఫాల్ట్ గా ఫ్లాష్ బేస్డ్ ads ను బ్లాక్ చేస్తుంది అని ఈ మధ్యనే వెల్లడించింది. సో adblock ప్లస్ యొక్క కొత్త బ్రౌజర్ ను గూగల్ ప్లే స్టోర్ నుండి మల్లీ బ్లాక్ చేయదు.
ఆధారం: Adblock ప్లస్