ABHA Health Card గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా మంచింది. ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య కార్యక్రమమే ఈ ABHA Health Card. దీన్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడి లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని కూడా చెబుతారు. ఇది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ద్వారా ప్రారంభించబడింది. అందుకే, ఈ ABHA Health Card ను మీరు ఎలా అందుకోవాలో తెలుసుకోండి మరియు ఈ కార్డ్ తో ఉపయోగాలు ఏమిటో కూడా ఈరోజు చూద్దాం.
ABHA కార్డ్ అంటే ఏమిటి?
ABHA కార్డ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది మీ ఆధార్ కార్డ్ లేదా మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి రూపొందించబడే 14-అంకెల గుర్తింపు సంఖ్యను ఉపయోగించే ఒక ప్రత్యేకమైన Heath ID. వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను బీమా ప్రొవైడర్స్, ఆసుపత్రులు, క్లినిక్‌లు మొదలైన వాటితో డిజిటల్‌గా షేర్ చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు.
ABHA కార్డ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?
ABHA కార్డ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, 'డాక్యుమెంటేషన్' లేదా 'మెడికల్ రిపోర్టులను చూసుకోవడం' వంటి సంక్లిష్ట పనుల నుండి మీకు విముక్తి కలుగుతుంది. అది ఎలా అంటే? ఈ 14-అంకెల సంఖ్య మీరు ఎక్కడ ఉన్నా మీ అన్ని మెడికల్ రికార్డ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది మరియు వాటిని షేర్ చేయడం చాలా సులభం చేస్తుంది.
దరఖాస్తు చేయడానికి అర్హత ఏమిటి?
మన దేశ పౌరులు ఎవరైనా ABHA కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ABHA కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ABHA కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి, మీరు దాని వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ ‘ఆప్షన్స్’ లో ‘Using Aadhar’ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ వర్చువల్ ఐడి లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. అది పూర్తయిన తర్వాత, మీరు ‘I agree’ పై క్లిక్ చేసి, పేర్కొన్న దరఖాస్తును సమర్పించవచ్చు. మీరు మీ ఫోన్‌లో అందుకున్న OTP ని ఇక్కడ నమోదు చేయండి మరియు తరువాత ‘Submit’ పై క్లిక్ చేయడం ద్వారా తదుపరి స్టెప్ ను నమోదు చేయవచ్చు. తర్వాత, వివరాలు మీ ఆధార్‌కు ఇవ్వబడతాయి. వాటిని మళ్లీ చెక్ చేసి, ‘Submit’ పై క్లిక్ చేయండి.
తర్వాత, మీరు మీ ఇమెయిల్ చిరునామాకు సమానమైన ABHA చిరునామాను సృష్టించగలరు. అది పూర్తయిన తర్వాత మీరు మీ ABHA కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.