ఆధార్ KYC ద్వారా తీసుకున్న మొబైల్ నంబర్లను తొలగించడంలేదు : నివేదికలు

Updated on 20-Oct-2018
HIGHLIGHTS

వినియోగదారులు కొత్త KYC అప్డేట్ కోసం కోరుకుంటే తప్ప, ఆధార్ ద్వారా తీసుకున్న మొబైల్ నంబర్లను తోలగించేది లేదని, DOT మరియు UIDAI ఉమ్మడి ప్రకటన చేసాయి.

ఆధార్ KYC, ద్వారా తీసుకున్న మొబైల్ నంబర్లను తొలిగిస్తారనే పుకార్లు ప్రస్తుతం ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఈ విషయం  మీద స్పందిస్తూ, కొత్త మొబైల్ కనెక్షన్లకు ఆధార్ యొక్క eKYC చేయరాదని మాత్రమే ప్రకటించారు తప్ప, ప్రస్తుతం వాడుకలో వున్న మొబైల్ నంబర్ల గురించి ఎటువంటి ప్రకటన చేయలేదని DOT మరియు UIDAI రెండు ప్రభుత్వ సంస్థలు ఉమ్మడి ప్రకటన చేశాయి. దీని ప్రకారంగా, ప్రస్తుతం వాడుకలో వున్నా మొబైల్ నంబర్ల తలొగింపు అనే విషయం కేవలం ఊహాగానాలు మాత్రమే తప్ప ఇందులో నిజం లేదని తెలుస్తోంది.

అయితే, వినియోగదారులు ఆధార్ నెంబర్ పరిరక్షణలో భాగంగా, తమ ఆధార్ KYC ని మొబైల్ నెంబర్ నుండి తొలిగించాలనుకుంటే మాత్రం కొత్త KYC అప్డేట్ చేయడం ద్వారా ఆధార్ KYC ని తొలగించవచ్చు. ఈ సమయ వ్యవధిలో కూడా ఎటువంటి డిస్కనక్షన్ జరగదని కూడా తెలుస్తోంది. భారతదేశ మొబైల్ నంబర్లలో   సగానికి పైగా వున్న వాటికీ ఆధార్ KYC గా ఉంది. ఈ నంబర్లను తొలగిస్తారని వస్తున్న పుకార్లను నమ్మవలసిన అవసరంలేదని, మనకు సుప్రీమ్ కోర్టు జడ్జిమెంట్ ద్వారా అర్ధమవుతోంది.                       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :