ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎవరికీ ఇవ్వవద్దు అంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనికోసం UIDAI కొత్త సర్క్యులర్ తీసుకువచ్చిందట, అంటూ ఒక వైరల్ మెసేజ్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఆధార్ కార్డ్ జిరాక్స్ ను ఇతరులకు ఇవ్వడం ద్వారా వారి ఆధార్ వివరాలను తప్పుగా లేదా ఇంకొకరు ఉపయోగించుకోవ్చని, అందుకే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎవరికీ ఇవ్వొద్దని ఈ మెసేజ్ చెబుతోంది. అంతేకాదు, UIDAI ఈ ఆదేశాలను జారీచేసినట్లు ఇందులో చెబుతున్నారు. కానీ, ఇదంతా అవాస్తావం అని UIDAI తేల్చి చెప్పింది.
వివరాల్లోకి వెళితే, ఆధార్ కార్డ్ జిరాక్స్ గురించి నెట్టింట్లో జరుగుతన్న కొత్త ప్రచారం పూర్తిగా అవస్థవమని UIDAI ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అసలు అటువంటిది ఏమిలేదని ఇటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. ఆధార్ సర్క్యులర్ పేరుతో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజీలో, ప్రజలు వారి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని ఎవరికి ఇవ్వవద్దని దాని వలన ప్రజల వివరాలు తప్పుగా ఉపయోగించబడే ప్రమాదం ఉందని, ప్రభుత్వం విన్నవిస్తునట్లుగా చెప్పబడింది. వాస్తవానికి, ఈ మెసేజీ పూర్తిగా అబద్దమని UIDAI తెలిపింది.
https://twitter.com/UIDAI/status/1628015246882512901?ref_src=twsrc%5Etfw
ఇది మాత్రమే కాదు, మాస్క్డ్ ఆధార్ ను వినియోగదారులు ఉపయోచాలని ప్రభుత్వం కోరుతున్నట్లుగా కూడా ఈ మెసేజీలో చెబుతున్నారు. అయితే, మీరు ఇటివంటి వాటి తప్పుడు ప్రచారం గురించి చింతించవలసిన పనిలేదని UIDAI తన ట్వీట్ తో తెలిపింది.