Aadhaar Card: 10 రోజుల్లో ముగియనున్న ఉచిత Aadhaar Update Service.!

Updated on 04-Sep-2023
HIGHLIGHTS

ఉచిత Aadhaar Update Service మరో పదిరోజుల్లో ముగుస్తుంది

ఆధార్ అప్డేట్ కోసం చూస్తున్న వారికి అలర్ట్

ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోదలచిన వినియోగదారులు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు

ఆధార్ అప్డేట్ కోసం చూస్తున్న వారికి అలర్ట్, ఆధార్ అప్డేట్ కోసం ప్రభుత్వం ప్రకటించిన ఉచిత Aadhaar Update Service మరో పదిరోజుల్లో ముగుస్తుంది. ఈ ఉచిత Aadhaar Update Service సర్వీస్ ను ప్రభుత్వం ముందుగా 2023 జూన్ 14వ తేదీ వరకూ ప్రకటించిన తరువాత, ఆ డేట్ ను మరో మూడు నెలలు పొడిగించి సెప్టెంబర్ 14వ తేదీ 2023 వరకూ ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ను ఇవ్వనున్నట్లు మూడు నెలల క్రితమే ప్రకటించింది. అయితే, ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ఇప్పడు మరో 10 రోజులో ముగియనున్నది.

ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త అడ్వైజ్ ప్రకారం, ఆధార్ కార్డ్ పొంది 10 సంవత్సరాల పైగా గడిచిన ప్రతి ఒక్కరూ కూడా వారి ఆధార్ కార్డ్ ను ప్రస్తుత వివరాలతో అప్డేట్ చేసుకోవవలసి ఉంటుంది. ఈ అప్డేట్ కోసం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగ కుండా ఉండడానికి ఉచిత Aadhaar Update Service ను కూడా ఆధార్ కార్డ్ వినియోగదారుల కోసం అందించింది కేంద్రం. 

Also Read: SIM Card New Rule: 10 లక్షల ఫైన్ తో కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ప్రవేశపెట్టిన కేంద్రం.!

అయితే, ఇప్పుడు ఈ ఉచిత Aadhaar Update Service ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది. అంటే, ఈ సర్వీస్ మరో 10 రోజుల్లో నిలిపి వేయబడుతుంది. అయితే, ఈలోపుగా ఈ సర్వీస్ ను ఉపయోగించుకొని ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోదలచిన వినియోగదారులు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

మీ ఆధార్ లో ముఖ్యమైన వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ సెంటర్ ను సంప్రదించ వలసి ఉంటుంది. అయితే, మీ ఆధార్ కార్డ్ లో మీ అడ్రెస్స్ ను మాత్రామే మార్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ కూడా చేసుకునే వీలుంది. దీనికోసం మీరు myaadhaar.uidai.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు చేసుకునే వీలుంది.

Also Read: Realme C51 Launched: ప్రీమియం లుక్, ఫాస్ట్ ఛార్జ్ మరియు 50MP AI Camera తో లాంచ్.! 

అయితే, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్ 14వ తరువాత ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ ను ప్రభుత్వం మరికొన్ని రోజులు పెంచుతుందా? లేక ఇంతటితో ఈ ఉచిత సర్వీస్ ను నిలిపి వేస్తుందో వేచి చూడాలి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :