కేంద్రం అందించిన ఆధార్ అప్డేట్ ఛాన్స్ ఈరోజుతో ముగుస్తుంది..!

Updated on 14-Jun-2023
HIGHLIGHTS

ఉచిత ఆధార్ అప్డేట్ ఛాన్స్ ఈరోజుతో ముగుస్తుంది

మూడు నెలల వెసులు బాటును అందించిన కేంద్రం

ఈరోజే ఆధార్ అప్డేట్ ను ముగించుకోవలసి ఉంటుంది

కేంద్రం అందించిన ఉచిత ఆధార్ అప్డేట్ ఛాన్స్ ఈరోజుతో ముగుస్తుంది. మార్చ్ తో ముగియనున్న ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ పైన  మూడు నెలల వెసులు బాటును అందించిన కేంద్రం జూన్ 14 ని డెడ్ లైన్ గా ప్రకటించింది. ఆధార్ కార్డ్ ను పొంది 10 సంవత్సరాలు గడిచిన ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ను కొత్త వివరాలతో అప్డేట్ చేసుకోవాలని సూచించిన కేంద్రం, దీనికి అనుకుగుణంగా ఈ ఉచిత ఆధార్ అప్డేట్ ఛాన్స్ ను కూడా ప్రవేశపెట్టింది మరియు ఈరోజుతో ఈ అవకాశం ముగుస్తుంది. 

ఆధార్ అప్డేట్ ను ఉచితంగా చేసుకునే అవకాశం ఈరోజు ముగుస్తుంది. ఇదెంత పెద్ద అమౌంట్ కాదులే దీనితో మాకేమి ఇబ్బంది లేదు అనుకునే వారికి ఇది పెద్ద సమస్య కాదు. అయితే, ఉచితంగా ఆధార్ అప్డేట్ చెయ్యడానికి ఎదురు చూసే వారి కోసమే ఈ ఇన్ఫర్మేషన్. అటువంటి వారు ఈరోజే వారి ఆధార్ అప్డేట్ ను ముగించుకోవలసి ఉంటుంది. 

వాస్తవానికి, ఆధార్ కార్డ్ లో కొన్ని వివరాలను మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే ఆన్లైన్ లో చాలా సింపుల్ గా మీరే చేసుకోవచ్చు. మీరు మీ లేటెస్ట్ అడ్రెస్స్ ను మీ ఆధార్ కార్డ్ లో అప్డేట్ చేసుకునే వీలుంది. దీని కోసం myaadhaar.uidai.gov.in పేజ్ లోకి వెళ్లి అప్డేట్ ఆధార్ అడ్రెస్ అప్షన్ ద్వారా మీ కొత్త అడ్రెస్ ను అప్డేట్ చేసుకోవచ్చు.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :