UIDAI: ఆధార్ కార్డ్ లో ఈ వివరాలు అప్డేట్ చేయ్యాలని కేంద్రం సూచన.!

Updated on 27-Feb-2023
HIGHLIGHTS

ఆధార్ కార్డ్ లో ఈ వివరాలు అప్డేట్ చేయ్యాలని కేంద్రం సూచించింది

ఆధార్ కార్డ్ అప్డేట్ చేసేందుకు కేంద్రం కొన్ని నియమాలను సవరించింది

ఖచ్చితమైన సమాచారం నిర్వహించడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్రం విన్నవించింది

UIDAI: ఆధార్ కార్డ్ లో ఈ వివరాలు అప్డేట్ చేయ్యాలని కేంద్రం సూచించింది. ఆధార్ కార్డ్ ను ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో అప్డేట్ చేసేందుకు కేంద్రం కొన్ని నియమాలను సవరించింది. ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త నియమాల ప్రకారం, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాకు ఒకసారి ఆధార్ కార్డ్ కలిగిన వారు వారి ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్రం సూచించింది. సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (CIDR) లో వ్యక్తి యొక్క ఖచ్చితమైన సమాచారం నిర్వహించడానికి ఈ విధానం సహాయపడుతుందని కేంద్రం విన్నవించింది. 

వాస్తవానికి, దేశంలో అన్ని పనులకు ప్రతిగా ఉపయోగించే ఐడెంటిటీ ప్రూఫ్ గా ఆధార్ అగ్ర స్థానంలో నిలుస్తుంది. అంటే, అన్ని ప్రభుత్వ  సర్వీస్ మరియు పథకాల లభ్ది కోసం ఆధార్ అనుసంధానం అవసరం అవుతుంది. అయితే, ఆధార్ కార్డ్ లో సరైన వివరాలు లేని కారణంగా ఆధార్ కార్డ్ హోల్డర్లు కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే, కేంద్రం అందించిన ఈ కొత్త ఆధార్ అప్డేట్ ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే వీలుంది.                   

ఇక ఈ కొత్త ఆధార్ నిబంధన గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఆధార్ కార్డ్ హోల్డర్ లు  ఆధార్ కోసం నమోదు చేసుకున్న తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలకు వారి ఆధార్‌ తో ముడిపడిన వారి సపోర్ట్ పత్రాలను తగ్గించుకోవచ్చు. దీనికోసం, కనీసం ఒక్కసారైనా, ప్రూఫ్  సమర్పించి, అప్‌డేట్ చేయవలసి ఉంటుంది. అంతేకాదు, దీనితో CIDR లో మీ సమాచారం యొక్క ఖచ్చితత్వం నిర్ధారించబడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, ఈ రూల్ ను ఖచ్చితంగా పాటించాలనే ఒత్తిడిని మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రక్రియ మ్యాండేట్రి గా నిర్వహించాలని తెలుపలేదు. కానీ, ప్రజలు తమ ఆధార్ సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం సూచించింది. మీరు ప్రూఫ్ గా సమర్పించ తగిన ఐడెంటిటీ ప్రూఫ్ లలో పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి మరిన్ని ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉన్నాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :