Aadhaar Update: ఆధార్ అప్డేట్ కు చివరి అవకాశం.. త్వరపడండి.!
భారతదేశంలో ఎంతో విశిష్టమైన గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డ్ నిలుస్తుంది
ఆధార్ కార్డ్ లో అన్ని వివరాలు కూడా కరెక్ట్ గా ఉంచుకోవడం మంచిది
తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం ప్రభుత్వం అందించింది
భారతదేశంలో ఎంతో విశిష్టమైన గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డ్ నిలుస్తుంది. అందుకే, ఆధార్ కార్డ్ లో అన్ని వివరాలు కూడా కరెక్ట్ గా ఉంచుకోవడం మంచిది. అయితే, ఆధార్ కార్డ్ లో అనుకోకుండా తప్పులు దొర్లే అవకాశం కూడా ఉంటుంది. అందుకే, ఆధార్ కార్డ్ లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునే అవకాశం ప్రభుత్వం అందించింది. అంతేకాదు, ఆధార్ కార్డులో వున్నా తప్పులను సరి చేసుకోవడానికి ఎటువంటి వంటి రుసుము లేకుండా ఉచితంగా చేసుకునే వీలు కల్పించింది.
Aadhaar Update
ఆధార్ అప్డేట్ ను చేసుకోవడానికి ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా సరి చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 14 గా UIDAI నిర్ణయించింది. అయితే, ప్రజల ఉపయోగార్ధం ఈ ఆఖరి తేదీని జూన్ 14 ఆధార్ అప్డేట్ కు చివరి అవకాశంగా ప్రకటించింది. వాస్తవానికి, ఆధార్ అప్డేట్ ఉచిత సర్వీస్ కోసం గత రెండు సంవత్సరాలుగా లాస్ట్ డేట్ ను పొడిగిస్తునే వుంది.
Also Read: Gold Price Down: పసిడి ప్రియులకు శుభవార్త..ఈరోజు తగ్గిన గోల్డ్ రేట్.!
ఆధార్ కార్డ్ లో పేరు, చిరునామా వంటి వివరాలలో ఏవైనా అక్షర దోషం ఉంటే ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సహాయంతో, ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాలను సందర్శించడం ద్వారా ఆధార్ అప్డేట్ లను చేసుకోవచ్చు. అయితే, ఆన్లైన్ లో కూడా ఆధార్ అప్డేట్ కోసం వినతిని అందించవచ్చు.
దీనికోసం, uidai.gov.in వెబ్సైట్ లో కి ప్రవేశించాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ మరియు రిజిష్టర్ నెంబర్ తో లాగిన్ అయ్యి వివరాలను సరి చూసుకోవాలి. మీ వివరాలు సక్రమంగా లేకుంటే మీ ఖచ్చితమైన వివరాలను కలిగిన సక్రమైన డాక్యుమెంట్ ను సబ్ మిట్ చేసి, మీ రిక్వెస్ట్ ను నమోదు చెయ్యాలి.
అయితే, మీరు ఇక్కడ తెల్సుకోవలసిన ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. అదేమిటంటే, ఆధార్ లో కొన్ని వివరాలను 2 సార్లు మాత్రమే మార్చుకునే వీలుంటుంది. అవేమిటంటే, పేరు, పుట్టిన తేదీ మరియు జెండర్ వివరాలను మళ్ళీ మళ్ళీ మార్చడం కుదరదు. అయితే, ఆధార్ లో అడ్రెస్ ను మాత్రం ఎన్ని సార్లైనా అప్డేట్ చేసుకునే వీలుంటుంది.