Aadhaar Update: 10 రోజుల్లో బంద్ కాబోతున్న ఆధార్ ఉచిత సర్వీస్.!

Updated on 04-Sep-2024
HIGHLIGHTS

UIDAI అందించింది ఉచిత అప్డేట్ సర్వీస్ సెప్టెంబర్ 14వ తేదీ కి ముగుస్తుంది

అదనపు ఫీజు లేకుండా ఆధార్ అప్డేట్ ను చేసుకోవచ్చు

మీ ఆధార్ అప్డేట్ ను ఉచితంగా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి

Aadhaar Update: దేశ ప్రజల హితవు కోసం రెగ్యులర్ గా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి UIDAI అందించింది ఉచిత అప్డేట్ సర్వీస్ సెప్టెంబర్ 14వ తేదీ కి ముగుస్తుంది. ఈ ఉచిత ఆధార్ అప్డేట్ గడువు తర్వాత చేసుకునే ఆధార్ అప్డేట్ కోసం 50 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ 10 రోజుల్లో ఈ సౌలభ్యం తో ఎటువంటి అదనపు ఫీజు లేకుండా ఆధార్ అప్డేట్ ను చేసుకోవచ్చు.

Aadhaar Update

ఆధార్ కార్డ్ తీసుకొని 10 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరు కూడా విధిగా వారి ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలి, అని UIDAI సూచించింది. దీనికి అనుగుణంగా ఆధార్ అప్డేట్ కోసం వాసులు చేసే రూ. 50 రూపాయల ఛార్జ్ ను ఎత్తి వేసి ఉచిత అప్డేట్ సర్వీస్ ను కూడా అందించింది. అయితే, ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ గడువు సెప్టెంబర్ 14వ తేదీ తో ముగుస్తుంది.

అంటే, సెప్టెంబర్ 14వ తేదీ తర్వాత ఈ సర్వీస్ ను ఉపయోగించుకునే కస్టమర్లు ఈ సర్వీస్ కోసం ఛార్జ్ చేయబడతారు. అందుకే, ఈ లోపుగా ఈ సర్వీస్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా మీ ఆధార్ అప్డేట్ ను ఉచితంగా చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి. లేదంటే సెప్టెంబర్ 14వ తేదీ తర్వాత ఫీజు చెల్లించాల్సి వస్తుంది.

ఆధార్ కార్డు అడ్రస్ అప్డేట్ ఆన్లైన్ లో చేసుకోండి

వాస్తవానికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఆధార్ కార్డు అడ్రస్ అప్డేట్. ఎందుకంటే, రెంట్ కి ఉండేవారు ఇల్లు మారుతూ ఉంటారు కాబట్టి ఎప్పటి ఎప్పటికప్పుడు కొత్త అడ్రస్ ను ఆధార్ కార్డు లో అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. అందుకే, ఈ అప్డేట్ ను ఆన్లైన్ లో సింపుల్ గా చేసుకోండి.

దీనికోసం ముందుగా myaadhaar.uidai.gov.in/document-update సైట్ లోకి వెళ్ళాలి. తర్వాత ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్టర్ మొబైల్ పై అందుకునే OTP తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ మీ అడ్రస్ మరియు ఇతర వివరాలు చెక్ చేసుకోండి. మీ అడ్రస్ తప్పుగా ఉంటే, లేటెస్ట్ అడ్రస్ ను ఎంటర్ చేసి దానికి తగిన డాక్యుమెంట్ ని అప్లోడ్ చెయ్యాలి. చేసిన తర్వాత వివరాలు మరోసారి చెక్ చేసుకుని సబ్ చేయాలి.

Also Read: రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మొదలైన Google Pixel 9 Pro Fold ఫస్ట్ సేల్.!

రిక్వెస్ట్ పంపిన తర్వాత రిక్వెస్ట్ ను స్వీకరించిన UIDAI మీ వివరాలు పరిశీలించిన తర్వాత అప్డేట్ అడ్రస్ తో కూడిన కొత్త ఆధార్ కొత్త అడ్రస్ కి అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :