ఆధార్ రూల్స్ సవరించిన ప్రభుత్వం..కొత్త అప్డేట్ తెలుసుకోండి.!

ఆధార్ రూల్స్ సవరించిన ప్రభుత్వం..కొత్త అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

ఆధార్ కార్డ్ కు సంబంధించి కొన్ని నియమాల సవరణలను ప్రభుత్వం ప్రకటించింది

ఆధార్ నిబంధనలలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది

ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది

ఆధార్ కార్డ్ కు సంబంధించి కొన్ని నియమాల సవరణలను ప్రభుత్వం ప్రకటించింది. క్లియర్ గా చెప్పాలంటే, ఆధార్ నిబంధనలలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ పత్రాలు మరియు ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ విషయం వినగానే కొత్త తలనొప్పి మొదలయ్యిందని మీరు అనుకోవచ్చు. కానీ, సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (CIDR) లో సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఈ విధానం సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది మరియు ఇది నిజానికి మంచి విషయమే.

ఇక ఈ కొత్త ఆధార్ నిబంధన గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఆధార్ కార్డ్ హోల్డర్ లు  ఆధార్ కోసం నమోదు చేసుకున్న తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలకు వారి ఆధార్‌ తో ముడిపడిన వారి మద్దతు పత్రాలను తగ్గించాలి. దీనికోసం, కనీసం ఒక్కసారైనా, రుజువును సమర్పించి, అప్‌డేట్ చేయండి. అని తెలిపింది. అంతేకాదు, దీనితో CIDR లో మీ సమాచారం యొక్క ఖచ్చితత్వం నిర్ధారించబడుతుందని   ప్రభుత్వం చెబుతోంది.

అయితే, ఈ రూల్ ను ఖచ్చితంగా పాటించాలనే ఒత్తిడిని మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రక్రియ మ్యాండేట్రి గా నిర్వహించాలని తెలుపలేదు. కానీ, ప్రజలు తమ ఆధార్ సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం సూచించింది. మీరు రుజువుగా సమర్పించగల గుర్తింపు పత్రాలలో పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి మరిన్ని ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo