Aadhaar New Rules: ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వ సూచన.!

Updated on 23-Feb-2023
HIGHLIGHTS

ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వ సూచన

మీ ఆధార్ ను లేటెస్ట్ వివరాలతో అప్డేట్ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది

కొన్ని నియమాలను కూడా సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వ సూచన. అంటే, మీ ఆధార్ కార్డ్ ను లేటెస్ట్ వివరాలతో అప్డేట్ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. దీనికోసం, ఆధార్ కార్డ్ కు సంబంధించి కొన్ని నియమాలను కూడా సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం, ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఆధార్ కార్డ్ హోల్డర్లు వారి పత్రాలు మరియు ఆధార్ కార్డ్ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే, సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ (CIDR) లో సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించడంలో ఈ విధానం సహాయపడుతుందని ప్రభుత్వం విన్నవించింది. నిజానికి మంచి విషయమే.

ఇక ఈ కొత్త ఆధార్ నిబంధన గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఆధార్ కార్డ్ హోల్డర్ లు  ఆధార్ కోసం నమోదు చేసుకున్న తేదీ నుండి ప్రతి 10 సంవత్సరాలకు వారి ఆధార్‌ తో ముడిపడిన వారి మద్దతు పత్రాలను తగ్గించాలి. దీనికోసం, కనీసం ఒక్కసారైనా, రుజువును సమర్పించి, అప్‌డేట్ చేయండి. అని తెలిపింది. అంతేకాదు, దీనితో CIDR లో మీ సమాచారం యొక్క ఖచ్చితత్వం నిర్ధారించబడుతుందని   ప్రభుత్వం చెబుతోంది.

అయితే, ఈ రూల్ ను ఖచ్చితంగా పాటించాలనే ఒత్తిడిని మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఈ ప్రక్రియ మ్యాండేట్రి గా నిర్వహించాలని తెలుపలేదు. కానీ, ప్రజలు తమ ఆధార్ సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాలని మాత్రం ప్రభుత్వం సూచించింది. మీరు రుజువుగా సమర్పించగల గుర్తింపు పత్రాలలో పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి మరిన్ని ప్రభుత్వ గుర్తింపు పత్రాలు ఉన్నాయి. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :