Aaadhaar: ఆధార్ అప్డేట్ కోసం ప్రభుత్వం అందించిన ఉచిత ఆధార్ అప్డేట్ గడువు మరో వారం రోజులు మాత్రమే మిగిలింది. జూన్ 14 వరకూ ఆధార్ అప్డేట్ ను ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా చేసుకునే అవకాశం వుంది. 10 సంవత్సరాలు మరియు అంతకన్నా పైబడిన ఆధార్ కార్డ్ లను లేటెస్ట్ వివరాలతో అప్డేట్ చేసుకోవాలాని చేసిన కేంద్ర ప్రభుత్వ సూచినకు అనుగుణంగా ప్రజలకు ఈ రాయితీ అవకాశాన్ని అందించింది.
వాస్తవానికి, ఉచిత ఆధార్ అప్డేట్ గడువు మార్చ్ నెలలోనే ముగియనుండగా, కేంద్ర ప్రభుత్వం మూడు నెలల సమయాన్ని పెంచి వెసులుబాటు కల్పించింది. ఈ గడువు జూన్ 14వ తేదీకి ముగుస్తుంది. అంటే, ఈ వారం రోజుల్లో మీరు మీ ఆధార్ కార్డు ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం వుంది.
దేశంలో ప్రధాన పత్రం గా చలామణి అవుతున్న ఆధార్ ను ఎప్పటి కప్పుడు అప్డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ పధకాలు మరియు ఇతర పాణిలకు ఆటంకం లేకుండా ఉంటుంది. మీ అడ్రెస్ ను ఎప్పటి అప్డేట్ చేసుకోవడం ఉత్తమైన విషయంగా ఉంటుంది. ప్రస్తుతం మీఆధార్ లో ఏవైనా తప్పులు ఉంటే ఉచితంగా అప్డేట్ చేసుక్కునే అవకాశం మీ ముందు వుంది.
అయితే, ఈ ఉచిత ఆధార్ అప్డేట్ అవకాశం కేవలం జూన్ 14వ టీటీఈ వరకూ మాత్రమే అందుబటులో ఉంటుందని గుర్తుంచుకోండి.