పైసా ఖర్చు లేకుండా ఆధార్ అప్డేట్..రెండు వారాలే గడువు.!

పైసా ఖర్చు లేకుండా ఆధార్ అప్డేట్..రెండు వారాలే గడువు.!
HIGHLIGHTS

మీ ఆధార్ కార్డ్ ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం

ఆధార్ అప్డేట్ కోసం చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్

ఖర్చు లేకుండా ఆధార్ అప్డేట్ చేసుకోండి

Aadhaar: ఆధార్ అప్డేట్ కోసం చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్, మీ ఆధార్ కార్డ్ ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఇప్పుడు మీకు అందుబాటులో వుంది మరియు ఈ గడువు మరో రెండు వారాల్లో ముగుస్తుంది. 10 సంవత్సరాలు లేదా అంత కంటే ఎక్కువ కాలం గడిచిన ప్రతి ఒక్కరూ విధిగా వారి ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించిన తరువాత, అప్డేట్ చేసుకునే వారికి ఎటువంటి ఖర్చు లేకుండా చేయడానికి వీలుగా ఈ ఉచిత ఆధార్ అప్డేట్ ను తీసుకొచ్చింది. 

వాస్తవానికి, ఉచిత ఆధార్ అప్డేట్ కోసం మూడు నెలల వెసులుబాటును ప్రభుత్వం అందించింది. అయితే, ఈ గడువు త్వరలోనే ముగిస్తుంది. జూన్ 14 ఈ ఉచిత ఆధార్ అప్డేట్ కోసం ఆఖరి తేదిగా నిర్ణయించింది. ఈ గడువు మరో రెండు వారాల్లో ముగియనున్నది. అందుకే, మీరు మీ ఆధార్ ను అప్డేట్ చెయ్యాలనుకుంటే ఈ జూన్ 14 లోపుగా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. 

మీ ఆధార్ లో అడ్రెస్స్ వంటి ఇతర వివరాలను మీరు ఉచితంగా అప్డేట్ చేసుకుని వీలుంది. మీ ఆధార్ ను ఎప్పటి కప్పుడు అప్డేట్ చెయ్యడం వలన మీకు ఆధార్ పరంగా ఎటువంటి సమ్యలు తలెత్తే అవకాశం లేకుండా చూసుకోవచ్చు. దేశంలో అన్ని అవసరాలకు ముఖ్యమైన పత్రంగా ఉపయోగించే ఆధార్ ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం జూన్ 14 వరకూ మాత్రమే అని గుర్తుంచుకోండి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo