Aadhaar Complaint: ఆధార్ తప్పులు లేదా సర్వీస్ ల పైన కంప్లైంట్స్ చెయ్యడం ఇప్పుడు మరింత సులభం అని చెబుతోంది UIDAI. మరింత సులభమైన మరియు వేగవంతమైన ఆధార్ సేవలను అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన మై ఆధార్ పోర్టల్ లో కొత్త సర్వీస్ జత చేసింది. ఈ కంప్లైంట్ పోర్టల్ నుండి మీ కంప్లైంట్ ను చాలా సులభంగా రిజిష్టర్ చేయవచ్చు. దీని కోసం మీ మొబైల్ లేదా ల్యాప్ టాప్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. వాస్తవానికి, హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించడం ద్వారా కూడా మీ యూజర్ ఆధార్ పైన ఏదైనా తప్పులు జరిగినప్పుడు కంప్లైంట్ రైజ్ చేసే అవకాశం వుంది.
అధికారిక ఆధార్ పోర్టల్ myaadhaar.uidai.gov.in నుండి ఎవరైనా సరే వారి ఆధార్ కి సంబంధించిన కంప్లైంట్ లను నమోదు చేయవచ్చు. ఈ సర్వీస్ ను గురించి వివరిస్తూ UIDAI కొత్త ట్వీట్ ను X నుండి షేర్ చేసింది. ఈ ఫెసిలిటీ ద్వారా యూజర్లు చాలా ఈజీగా వారి కంప్లైంట్ లను నమోదు చేసి దానికి తగిన సపోర్ట్ ను వేగంగా అందుకునే అవకాశం ఉందని చెబుతోంది. ఈ ట్వీట్ ను క్రింద చూడవచ్చు.
ఆధార్ కంప్లైంట్ చేయడం చాలా సులభం. మరి ఇది ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామా. దీనికోసం మీరు ముందుగా myaadhaar.uidai.gov.in వెబ్సైట్ ను ఓపెన్ చెయ్యాలి. ఇక్కడ Welcome to My Aadhaar పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ను పైకి స్క్రోల్ చేస్తే, అడుగున File a Complaint అనే సెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపించిన ట్యాబ్ పైన నొక్కడం ద్వారా కంప్లైంట్ పేజ్ లోకి చేరుకోవచ్చు. ఇక్కడ అడిగిన వివరాలను నమోదు చేయడం ద్వారా మీ కంప్లైంట్ ను రిజిష్టర్ చేయవచ్చు.
కంప్లైంట్ పేజ్ లోకి వెళ్లిన తరువాత మీ పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ అడ్రెస్స్, రాష్ట్రం వివరాలను ఎంటర్ చెయ్యాలి. ఇక్కడ తరువాత వచ్చే కాలమ్ లో కంప్లైంట్ మీ కోసం చేస్తున్నారా (Self) లేక ఇతరల (other) కోసం చేస్తున్నారో సెలెక్ట్ చెయ్యాలి. ఇక్కడ క్రింద వచ్చే మరో కాలమ్ లో కంప్లైంట్ టైప్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వున్నా వాటిలో మీ కంప్లైంట్ కి తగిన దానిని ఎంచుకోవాలి.
Also Read: Gold Rate Down: భారిగా తగ్గిన బంగారం ధర..లైవ్ గోల్డ్ రేట్ తెలుసుకోండి.!
ఆలా ఎంచుకున్న తరువాత క్రింద మరొక కాలమ్ ఉంటుంది. ఇక్కడ పైన ఎంచుకున్న కంప్లైంట్ టైప్ ను బట్టి ప్రాబ్లమ్ కేటగిరి టైప్ కోసం ఆప్షన్ లు వస్తాయి. ఒకవేళ మీ ఆధార్ నమోదు చేసిన సెంటర్ నుండి ఏదైనా కంప్లైంట్ ఉంటే కూడా దాన్ని కూడా ఇక్కడ నమోదు చేయవచ్చు. ఇక చివరిలో అందించిన బాక్స్ లో మీ డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేసి మీ కంప్లైంట్ ను రిజిష్టర్ చేయవచ్చు.