Aadhaar Card: ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త అందించింది కేంద్ర సర్కార్. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునే వారికి సహాయంగా అందించిన ఉచిత ఆధార్ కార్డ్ అప్డేట్ అవకాశాన్ని మరింత పొంగించింది. ఉచిత ఆధార్ అప్డేట్ ను ముందుగా మార్చి 2023 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకటించిన కేంద్రం, ఈ అవకాశాన్ని జూన్ 14 వరకూ 2023 పొడిగించింది. అయితే, ప్రజలకు ఆధార్ అప్డేట్ ఖర్చు నుండి వెసులుబాటు కోసం ఉచిత ఆధార్ అప్డేట్ ను సెప్టెంబర్ 14 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది.
అంటే, ఉచిత ఆధార్ అప్డేట్ అవకాశం ఇప్పుడు ప్రజలకు మరొక మూడు నెల వరకూ అందుబాటులో ఉంటుంది. ఆధార్ తీసుకొని 10 సంవత్సరాల కాలం గడిచిన ప్రతి ఒక్కరూ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించిన కేంద్రం, ఈ అప్డేట్ కోసం ప్రజలకు నుండి వసూలు చేసే రుసుము నుండి వెసులుబాటును కూడా ఈ ఉచిత ఆధార్ అప్డేట్ ద్వారా అందించింది.
అంటే, మీరు ఆధార్ కార్డ్ తీసుకొని చాలా కాలం అయితే, మీ ఆధార్ అప్డేట్ కోసం ఈ ఉచిత ఆధార్ అప్డేట్ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే, ఆధార్ కార్డ్ లో మీ అడ్రెస్స్ ను మార్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు.