పాన్-ఆధార్ లింక్ గడువును మరొకసారి పొడిగించిన కేంద్రం.. అయితే ఇది తెలుసుకోండి.!
పాన్ లింక్ చేయ్యని వారి PAN Card ఇన్ యాక్టివ్ అవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది
ఈ గడువును ఇప్పుడు జూన్ 30 వరకూ పొడిగించి ప్రజలకు మరొకసారి వెసులుబాటును కల్పించింది
పాన్ తో ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ స్తంభించి పోతుంది
ముందుగా, మార్చి 31 లోపల ఆధార్ తో పాన్ లింక్ చేయ్యని వారి PAN Card ఇన్ యాక్టివ్ అవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, ఈ గడువును ఇప్పుడు జూన్ 30 వరకూ పొడిగించి ప్రజలకు మరొకసారి వెసులుబాటును కల్పించింది. పాన్ మరియు ఆధార్ లింక్ చేయకుంటే ఏమవుతుంది అనుకుంటున్నారా? గడువు ముగిసే లోపుగా ఆధార్-పాన్ లింక్ చెయ్యని వారి పాన్ కార్డ్ ఇన్ ఆపరేటివ్ గా మారుతుంది. అంటే, పాన్ తో ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్ స్తంభించి పోతుంది.
అందుకే, గడువు లోపుగా PAN Card కలిగిన ప్రతిఒక్కరూ కూడా విధిగా వారి ఆధార్ తో లింక్ చెయ్యాలని కేంద్రం చెబుతోంది. అయితే, పాన్ ఆధార్ లింక్ కోసం 1,000 రూపాయల ఫైన్ మీరు కట్టవలసి ఉంటుంది. మీ పాన్ -ఆధార్ లింక్ అయ్యిందో లేదో అని మీకు డౌటా? అయితే మీ పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఎలా చెక్ చెయ్యాలో క్రింద చూడవచ్చు.
పాన్-ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇలా చెక్ చెయ్యండి
ముందుగా, https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైట్ కి వెళ్ళాలి. తరువాత Link Aadhaar పైన నొక్కండి మరియు కొత్త పేజ్ వన్ అవుతుంది. ఇక్కడ PAN క్రింద ఉన్న బాక్స్ లో పాన్ నంబర్, Aadhaar Number క్రింద ఉన్న బాక్సులో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ప్రక్కనే ఉన్న 'Validate' పైన నొక్కండి. ఒకవేళ మీ ఆధార్-పాన్ లింక్ అయ్యి ఉంటే, మీకు లింక్ అయినట్లు చూపిస్తుంది. ఒకవేళ లింక్ అవ్వకుంటే తరవాతి వివరాల్లోకి తీసుకు వెళుతుంది. ఇక్కడ 'Continue to pay through e-pay Tax' అని సూచిస్తుంది. అంటే, మీ పాన్-ఆధార్ లింక్ అవ్వలేదని అర్ధం.