టెక్ విడ్డూరం: షోరూమ్ లో ఉన్న 12 పెద్ద రోబోట్ లను కిడ్నాప్ చేసిన చిన్న రోబోట్.!

Updated on 21-Nov-2024

టెక్ విడ్డూరం: ఇప్పుడు సీన్నున్ చేప్పే విషయం వింటే మీరు కూడా ఇది నిజంగా విడ్డురం అనే అంటారు. ఇన్నాళ్లు మనుషులను, జంతువులను కిడ్నాప్ చేయడం విని ఉంటారు. కానీ ఇప్పుడు ఒక రోబోట్ మరో రోబోట్ ను కిడ్నాప్ చేయడం గురించి వింటున్నాం. అది కూడా ఒక రోబోట్ షాపుకు వెళ్ళి మరి కిడ్నాప్ చేసిందట. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్న ఇది నిజంగా నిజం అండి. ఈ వింత వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒకరు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఏమిటా టెక్ విడ్డూరం?

ఒక చిన్న రోబోట్ మెల్లగా వెళ్ళి ఒక షాప్ లో ఉన్న 12 పెద్ద రోబోట్ లను మాటల్లో పెట్టి కిడ్నాప్ చేసింది. ఇది ఆ షాప్ లోని CCTV లో రికార్డు అయ్యింది. చూడటానికి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ లోని సీన్ లాగా అనిపిస్తుంది. అంతేకాదు, ఈ వీడియో చుసిన వారు ముందుగా ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అయివుంటుంది, అని కొట్టిపారేశారు.

అయితే, ఈ రోబోట్ ఈ రోబో తయారు వారూ మరియు రోబోటిక్ కంపెనీ కూడా ఇది ఒక సెక్యూరిటీ లూప్ హోల్ కారణంగా జరిగినట్లు నిర్ధారించారు. విషయానికి వస్తే, Erbai అనే పేరు కలిగిన చిన్న Hangzhou బేస్డ్ రోబోట్ కంపెనీలోని 12 రోబోలను తను పని నుంచి పడలేక లేక పోతున్నాను కనుక తనతో కలిసి రావాలని మిగతా రోబోట్ లను కన్విన్స్ చేసింది.

అంతే, ఈ కన్వర్జేషన్ తర్వాత దాదాపు 12 పెద్ద రోబోట్ లు ఆ చిన్న రోబోట్ వెంబడించి వెనుకే దారి పట్టాయి. ఇది చూడటానికి కన్విన్సింగ్ కిడ్నాప్ గా కనిపించింది. కన్విన్స్ అయిన రోబోట్ లను తయారు చేసిన షాంగై కంపెనీ దీన్ని కిడ్నాప్ గానే అభివర్ణించింది. ఈ టెక్ విడ్డురానికి చైనా వేదికగా మారింది.

Also Read: QLED Smart Tv: కేవలం 8 వేల ధరకే 32 ఇంచ్ క్యూలెడ్ టీవీ అందుకోండి.!

ఇవన్నీ చూస్తుంటే రానున్న కాలంలో ఇంకా ఎలాంటి టెక్ విడ్డూరాలు చూడవలసి వస్తుందో అని చెవులు కొరుక్కుంటున్నారు. ఇది ఇలా ఉంటే రోబోట్ ఇలా ప్రవర్తిస్తే ముందు ముందు రోజులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు హితవు పలుకుతున్నారు.

Note: మెయిన్ ఇమేజ్ కల్పితం మాత్రమే

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :