2025 జనవరి 1 నుంచి ఈ ఫోన్ లలో WhatsApp పనిచేయడం ఆగిపోతుంది.!
ఈ ఫోన్ లలో WhatsApp పనిచేయడం ఆగిపోతుంది
ఈ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న యూజర్లు 2025 జనవరి 1 నుంచి WhatsApp వాడలేరు
మీ ఫోన్ కూడా ఈ లిస్ లో ఉందేమో చెక్ చేసుకోండి
2025 జనవరి 1 నుంచి ఈ ఫోన్ లలో WhatsApp పనిచేయడం ఆగిపోతుంది, అని ఒక నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ఈ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న యూజర్లు కొత్త సంవత్సరం ను ఉపయోగించలేరు, అని ఈ నివేదిక తెలిపింది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే కొత్త సంవత్సరం నుంచి మీ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ పనిచేయడం మానేస్తుంది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ మరియు అప్డేట్స్ తో అందరికీ తగిన విధంగా తన ఆప్ ను మరింత ఉన్నతంగా మారుస్తోంది. అయితే కొన్ని పాత ఫోన్లలో వాట్సప్ పనిచేయడం మానేస్తుందని HDblog తెలిపింది. ఈ బ్లాగ్ ప్రకారం, కొన్ని HTC, Samsung మరియు LG ఫోన్లలో వాట్సాప్ నిలిచిపోతుంది. అంతేకాదు, వాట్సప్ నిలిచిపోనున్న ఆ స్మార్ట్ ఫోన్స్ యొక్క లిస్ట్ కూడా ఈ నివేదిక అందించింది. ఇక్కడ వాట్సాప్ నిలిచిపోనున్న ఫోన్స్ లిస్ట్ ను బ్రాండ్ ప్రకారం చూడవచ్చు.
HTC
HTC యొక్క నాలుగు ఫోన్ లలో వాట్సాప్ నిలిచిపోతుంది. అవి, వన్ X, వన్ X+, డిజైర్ 500, డిజైర్ 601 స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి.
LG
LG యొక్క 4 స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ పని చేయడం మానేస్తుంది. ఇందులో ఆప్టిమస్ G, నెక్సస్ 4, G2 మినీ మరియు LG L90 స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి.
Motorola
ఈ లిస్ట్ లో మోటోరోలా యొక్క మూడు స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. మోటో G (Gen 1), రేజర్ HD, మోటో E 2014.
Samsung
శామ్సంగ్ యొక్క గెలాక్సీ 3, గెలాక్సీ నోట్ 2, గెలాక్సీ ఏస్ 3 మరియు గెలాక్సీ S4 మినీ స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ నిలిచిపోతుంది.
Also Read: Sony Smart Tv ల పై అమెజాన్ ధమాకా ఆఫర్ అందుకోండి.!
Sony
ఎక్స్ పీరియా Z, ఎక్స్ పీరియా SP, ఎక్స్ పీరియా T మరియు ఎక్స్ పీరియా V ఫోన్ లలో కూడా వాట్సాప్ ఆగిపోతుందని ఈ రిపోర్ట్ చెబుతోంది.