ఇండియా పోస్ట్ PAN Update పేరుతో కొత్త ఒక SMS ఇప్పుడు విరివిగా సర్క్యులేట్ అవుతోంది. ఈ మెసేజ్ ను క్లిక్ చేసి అడిగిన వివరాలు వెంటనే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలని, లేకపోతే కోరుతుంది కోరుతుంది. ఒకవేళ ఇలా చేయని పక్షంలో మీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేయబడుతుంది, అని ఇందులో ఉంటుంది. అయితే, ఈ మెసేజ్ పూర్తిగా మోసపూరితమైనది అని PIB Fact Check వెల్లడించింది.
మీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లో మీ పాన్ కార్డు అప్డేట్ చేయకపోతే మీ అకౌంట్ 24 గంటల్లో బ్లాక్ అవుతుంది, అని ఒక కొత్త SMS మొబైల్ ఫోన్ లలో చక్కర్లు కొడుతోంది. ఈ మెసేజ్ ను చాలా మంది మొబైల్ యూజర్లు మెసేజ్ ను అందుకుంటున్నట్లు PIB ఫ్యాక్ట్ చెక్ గుర్తించింది. ఈ మెసేజ్ లను నమ్మి మోసపోకండి అని తన X అకౌంట్ నుంచి ఈ మెసేజ్ గురించి వెల్లడించింది.
PIB ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ఈ మెసేజ్ లను మొబైల్ ఫోన్ లలో యూజర్లు అందుకుంటుంన్నట్లు తెలిపింది. అయితే, వాస్తవానికి ఇటివంటి మెసేజ్ లేదా కాల్స్ వంటి వాటిని ఇండియా పోస్ట్ ఇప్పటి వరకు పంపించలేదని మరియు ఇలాంటి వాటిని వద్దని కూడా తెలిపింది. దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ ను తన అధికారిక x అకౌంట్ నుంచి షేర్ చేసింది. ఈ ట్వీట్ ను ఈ క్రింద చూడవచ్చు.
ఇది ఇలా ఉంటే ఎప్పుడైనా ఇలాంటి మోసపూరిత పోస్ట్ లు లేదా మెసేజ్ లు మీ మొబైల్ కు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా, ఈ మెసేజ్ సోర్స్ ను ముందుగా పరిశీలించడం చెయ్యాలి. అంతేకాదు, మెసేజ్ లలో వచ్చే లింక్స్ పైన క్లిక్ చేయకుండా అధికార సోర్స్ లను సంప్రదించి వివరాలు తెలుసుకోండి. ఈ మధ్య కాలంలో ఇటువంటి మోసాలు ఎక్కువవుతున్నాయి అందుకే తస్మాత్ జాగ్రత్త సుమీ.
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 11 వేలకే లభిస్తున్న QLED స్మార్ట్ టీవీ.!
ముఖ్యంగా అర్జెన్సీ చూపించే విధంగా లేదా ఉచిత తాయిలాలతో మభ్యపెట్టే మెసేజ్ లను నమ్మి మోసపోకండి.