అంధురాలికి చూపు ప్రసాదించిన AI Eye Surgery
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన ఒక అద్భుతం ఇప్పుడు వైరల్ గా మారింది
చూపు కోల్పోయిన ఒక అంధురాలు AI Eye Surgery తో చూపు తిరిగి పొందింది
AI ఇప్పుడు మానవజాతికి ఉపయోగకరంగా మారింది
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన ఒక అద్భుతం ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తిగా చూపు కోల్పోయిన ఒక అంధురాలు AI Eye Surgery తో చూపు తిరిగి పొందింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేసిన అద్భుతాల లిస్ట్ లో ఇప్పుడు ఇది కూడా చేరిపోయింది. ఇప్పటికే అనేక కేటగిరీలలో అద్భుతాలు సృష్టించిన AI ఇప్పుడు మానవజాతికి ఉపయోగకరంగా మారింది. AI చేసిన ఈ అద్భుతం గురించి తెలుసుకుందామా.
ఏమిటి ఈ AI Eye Surgery
32 సంవత్సరాల పోర్చుగీస్ మహిళ 20/200 కంటే తక్కువ నెంబర్ తో దాదాపు చూపు కోల్పోయిన పరిస్థితుల్లో కొనసాగుతుంది. సదరు మహిళ AI సర్జరీతో ఇప్పుడు 20/16 తో నార్మల్ కంటే అధిక పవర్ తో చూపును తిరిగి పొందింది. పోర్చుగీస్ మహిళ Patrícia Gonçalves తన చూపును సరిచేసుకోవడానికి సరికొత్త Lasik ప్రోసిజర్ ను ఆశ్రయించింది. ఈ సర్జరీ ద్వారా ఈ మహిళ చూపు తిరిగి పొందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
Patrícia, ఆస్టిగ్మాటిజం మరియు మయోపియా కారణంగా అద్దాలు వాడినా కానీ చూడలేని పరిస్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితి చూసిన Dr. David Allamby ఆమెకి AI ప్రోగ్రామ్ తో ఈ AI సర్జరీ నిర్వహించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిర్వహించిన వేలకొద్దీ లేజర్ సర్దుబాట్లతో ఈ ఈ సర్జరీని నిర్వహించారు. ఇందులో ఆమె కళ్ళకు తగిన లేజర్ సర్దుబాట్లు ఎఐ సమకూర్చింది. ఈ విధంగా నిర్వహించిన సర్జరీ ద్వారా డాక్టర్లు ఆమెకు తిరిగి చూపును ప్రసాదించారు. ఈ సర్జరీని Eyevatar గా పిలుస్తున్నారు.
Also Read: Hot Deal: 13 వేలకే లేటెస్ట్ 43 ఇంచ్ Smart Tv అందుకోండి.!
ఏమిటి Eyevatar?
Eyevatar ని ముందుగా చైనా మరియు ఆస్ట్రేలియాలో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, ఈ లైఫ్ ఛేంజింగ్ టెక్నాలజీ ఇప్పుడు UK లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త ఐ కేర్ టెక్నాలజీ కేవలం 10 నిమిషాల్లో కళ్ళను సరి చేయడానికి అవసరమైన అత్యంత ఖచ్చితమైన మ్యాపింగ్ ను చేస్తుంది. దీని ద్వారా 2,000 వరకూ లేజర్ భీమ్స్ ని ఉపయోగించి AI వ్యక్తి కళ్ళను సరిచేస్తుంది.
ఈ సర్జరీ ద్వారా సాధారణ మనిషి కళ్ళు నమోదు చేసే 20/20 కంటే కూడా మరింత అధిక రేటుతో చూపును ప్రసాదిస్తుంది. Patrícia ఇప్పుడు 20/16 నెంబర్ తో పదునైన చూపును కలిగి ఉందని డాక్టర్ Allamby తెలిపారు.ఈ వార్తను నిన్న తరువాత రానున్న కాలంలో AI ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తుందో అని ఈ టెక్ ను కొనియాడుతున్నారు.