ప్రజలను పీడిస్తున్న 94 లోన్ మరియు 138 బెట్టింగ్ యాప్స్ బ్యాన్ కాబోతున్నాయి.!
పేద ప్రజలను పట్టిపీడిస్తున్న 94 లోన్ మరియు 138 బెట్టింగ్ యాప్స్ బ్యాన్ కాబోతున్నాయి
అనైతిక యాప్స్ ను బ్యాన్ చేయడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగబోతోంది
ఇటివంటి యాప్స్ మన తెలుగురాష్ట్రాల్లో చాలా మంది బలవన్మరణాలకు కారణమయ్యాయి
పేద ప్రజలను పట్టిపీడిస్తున్న 94 లోన్ మరియు 138 బెట్టింగ్ యాప్స్ బ్యాన్ కాబోతున్నాయి. ఇది నిజంగా చాలా మంది ప్రజలకు పండుగ లాంటి శుభవార్త. చైనీస్ మూలాల లింక్స్ తో కూడిన ఈ యాప్స్ ను భారత ప్రభుత్వం అతి త్వరలో బ్యాన్ చేయనున్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఈ విషయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నలాజి (MeitY) ని ఆదేశించినట్లుగా కూడా కొత్త నివేదికలు పేర్కొన్నాయి.
ప్రజల పైన దుశ్చర్యలకు పాల్పడుతున్న ఈ రకమైన యాప్స్ ను అర్జంట్ మరియు ఎమర్జెన్సీ ప్రాతిపదికన తోలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందేహాస్పద యాప్స్ తక్కువ వడ్డీ మరియు సులభమైన డాక్యుమెంట్స్ పేరుతో పేద ప్రజలకు వల వేస్తాయి మరియు ఆ తర్వాత సంవత్సరానికి 3,000% వరకు వడ్డీ గుంజుతున్నాయి. దీనికోసం, లోన్ తీసుకున్న వారి అసభ్యకరమైన మర్ఫింగ్ చిత్రాలతో సహా అసభ్యకరమైన మెసేజెస్ తో బెదిరింపులకు పాల్పడతారు. అందుకే, ఇటివంటి అనైతిక యాప్స్ ను బ్యాన్ చేయడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగబోతోంది.
అయితే, దురదృష్టవశాత్తు ఇటివంటి యాప్స్ మన తెలుగురాష్ట్రాల్లో చాలా మంది బలవన్మరణాలకు కారణమయ్యాయి. కేవలం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే కాదు ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో కూడా ఇటివంటి సంఘటనలు జరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని కేంద్రం దృష్టికి తెచ్చాయి. వీటితో పాటుగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఈ యాప్స్ పైన చర్యల కోసం చేయికలిపింది.
దీన్ని పరిగణలోకి తీసుకున్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) సుమారు రెండు నెలల క్రితం 28 అనుమానిత లోన్ యాప్ లను విశ్లేషించడం ప్రారంభించింది. అయితే, ఆ లిస్ట్ చివరికి 94 యాప్స్ కి పెరిగింది. ఇవి కాకుండా, చైనా ప్రజలకు నేరుగా కనెక్షన్ కలిగిన కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లు కూడా ఉన్నాయి.
ఈ యాప్స్ Google Play మరియు Apple యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉండకపోవచ్చు కానీ వివిధ స్వతంత్ర వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి. అయితే, వీటన్నిటిని ఇండియాలో బ్యాన్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు కొత్త నివేదికలు వెల్లడించాయి.
ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత పూర్తి జాబితాను మేము షేర్ చేస్తాము.