IT మరియు ఎలెక్ట్రానిక్స్ లో
కొత్తగా ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తరువాత ఆంద్ర రాష్ట్రం లో IT జాబ్స్ ను తేవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంది. ఈ సందర్భంలో IT సెక్టార్ లో కొత్తగా 5 లక్షల జాబ్స్ ను తెచ్చే ప్రయత్నాలు జరిపినట్టు వెల్లడించారు మినిస్టర్ రఘు నాద రెడ్డి.
IT లో 5 లక్షలు, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ లో 4 లక్షల ఉద్యోగాల అవకాశాలు రానున్నాయని స్పష్టం చేసారు. అయితే ఇది జరగటానికి కచ్చితంగా ఒక సంవత్సరం పైనే పడ్తుంది అని అంటున్నారు. విజయవాడ లో రిపోర్ట్స్ తో మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరానికల్లా ఒక్క IT సెక్టార్ నుండి ఆంద్ర కు 12 కోట్ల రెవెన్యు మరియు ఎలెక్ట్రానిక్ సెక్టార్ నుండి 30 కోట్లు రెవెన్యూ వచ్చేలా కార్యకలాపాలు జరిపాము అని చెప్పారు మంత్రి.
రెండు రాష్ట్రాలుగా విడిపోకముందు IT నుండి 65 కోట్ల రెవెన్యూ ఉండగా ఇప్పుడు ఆంధ్రాకు 1600 కోట్ల IT రెవెన్యు వస్తుంది. గవర్నమెంట్ చేపట్టిన సింగిల్ విండో license పాలసీ కారణంగా కొత్తగా 28 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వీటి వలన వైజాగ్, అనంతపుర్ మరియు కాకినాడ సిటీస్ లో 37 వేల కొత్త employment అవకాశాలు వస్తున్నట్లు చెప్పారు ఆంధ్ర IT మినిస్టర్.