మొట్ట మొదటి 8K వీడియో ఒకటి యుట్యుబ్ లోకి అప్లోడ్ అయ్యింది

మొట్ట మొదటి 8K వీడియో  ఒకటి యుట్యుబ్ లోకి అప్లోడ్ అయ్యింది
HIGHLIGHTS

దీని పేరు Ghost టౌన్స్. రెండు నిముషాలు నిడివి.

ప్రస్తుతం మనం స్మార్ట్ ఫోన్లలో ఫుల్ HD(FHD) వీడియోలను చూడగలుగుతున్నాం. కొన్ని హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్ 2K డిస్ప్లే లను కూడా దించాయి. కొన్ని స్మార్ట్ TV లలో అయితే 4K వీడియోస్ ను చూసేందుకు వీలుగా  టెక్నాలజీ వచ్చింది. అయితే వీడియో దిగ్గజం, యుట్యుబ్ లో ఇప్పుడు 8K వీడియోస్ కనిపించనున్నాయి. తాజాగా Ghost Town పేరుతో ఒక 8K వీడియో అప్ లోడ్ అయ్యింది. సాధారణంగా 4K అనేది మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా థియేటర్ స్క్రీన్ పై చూడగలిగే స్క్రీన్ రిసల్యుషణ్.

అయితే యుట్యుబ్ లో 8K వీడియోలను అప్లోడ్ చేసే టెక్నాలజీ సదుపాయం వాళ్లు 2010 లోనే ప్రవేశపెట్టారు అని చెబుతుంది యుట్యుబ్. ఘోస్ట్ టౌన్ పేరుతో అప్ లోడ్ అయిన ఈ వీడియో ఒక షార్ట్ ఫిలిం. ఇది రెడ్ ఎపిక్ డ్రాగన్ 6K పై షూట్ చేయటం జరిగింది. ఎడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ప్రాసెస్ చేసారు. అయితే ప్రస్తుతం దీనికి క్రోమ్ బ్రౌజర్ లో ప్లే సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు ఆ 8K వీడియోను చూడగలరు.

యుట్యుబ్ 8K వీడియోను అప్ లోడ్ చేయటానికి 2010 లో అనుమతించినా 8K రిసల్యుషణ్ లో వీడియో ను రికార్డ్ చేసే టెక్నాలజీ ఇంతవరకూ అందుబాటులో లేదు. అయితే LG మాత్రం ఈ సంవత్సరం మే నెలలో 5K టివి ని విడుదల చేసింది. 105in సినిమా స్కోప్ 21:9 రేషియో 7.2 చానెల్, 150 వాట్ స్పీకర్స్ దీనిలో ఉన్నాయి.

8K వీడియో షార్ట్ ఫుటేజ్ ను క్రింద చూడగలరు.

Kul Bhushan
Digit.in
Logo
Digit.in
Logo