Dark Web: దాదాపుగా 81 కోట్ల భారతీయుల డేటా లీక్|Tech News
దాదాపుగా 81 కోట్ల భారతీయుల డేటా లీక్
ఈ డేటా చీప్ గా అమ్మకానికి కూడా పెట్టారంట
ఇప్పటి వరకూ చూడని అతిపెద్ద డేటా లీక్ గా ఇది చెప్పబడుతోంది
Dark Web: దాదాపుగా 81 కోట్ల భారతీయుల డేటా లీక్ అయినట్లు మరియు ఈ డేటా చీప్ గా అమ్మకానికి కూడా పెట్టినట్లు కళ్ళు బైర్లు కమ్మే వార్త ఒకటి బయటికి వచ్చింది. 81 కోట్ల మంది భారతీయుల ఆధార్, పాస్ పోర్ట్, మొబైల్ నెంబర్స్ తో పాటుగా వారి అడ్రెస్ లతో సహా ఒక హ్యాకర్ డార్క్ వెబ్ లో అమ్మకానికి ఉంచినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ మరియు ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. దేశం ఇప్పటి వరకూ చూడని అతిపెద్ద డేటా లీక్ గా ఇది చెప్పబడుతోంది.
Data Leak on Dark Web:
డార్క్ వెబ్ లో pwn0001 పేరుతొ ఒక గుర్తు తెలియని హ్యాకర్ 81 కోట్ల మంది భారతీయుల ఆధార్ మరియు పాస్ పోర్ట్ వివరాలు సేల్ కోసం అందుబాటులో ఉన్నట్లు ప్రకటన చేశారు. భారత్ పాపులేషన్ 140 కోట్లకు పైగా ఉండగా, ఇందులో 81 కోట్ల మంది సున్నితమైన డేటా లీక్ అయ్యిందంటే మీరు అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద డేటా లీక్ అని.
ఎక్కడ నుండి ఈ డేటా లీక్ అయ్యుండవచ్చు?
ఈ విషయం వినగానే మొదటిగా వచ్చే డౌట్ ఎక్కడ నుండి ఈడేటా లేక్ అయ్యింది? అని. విషయాన్ని కూడా బయట పెట్టింది ఈ సంస్థ. COVID-19 సమయంలో ఇండియన్ మెడియల్ కౌన్సిల్ ఆఫ్ రీసర్చ్ (ICMR) సేకరించిన డేటాని వారు సంపాదించినట్లు ఈ సంస్థ విశ్వసిస్తోంది.
Also Read : Nokia Discount offer: నోకియా ఫోన్ల పైన భారీ కూపన్ ఆఫర్ అనౌన్స్ చేసిన నోకియా.!
లీకైన ఈ డేటాలో ఎటువంటి వివరాలు ఉన్నాయి?
హ్యాకర్ తెలిపిన ప్రకారం, ఈ లీకైన డేటాలో పేరు, అడ్రెస్స్, మొబైల్ నెంబర్ తో కూడిన ఆధార్ మరియు పాస్ పోర్ట్ వంటి చాలా సున్నితమైన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ వివరాలు కరోనా సమయంలో ICMR సేకరించిన డేటా నుండి తీసుకోబడినట్లు కూడా ఈ హ్యాకర్ చెబుతున్నాడు.
అయితే, ఈ విషయం పై కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ (central IT Department) ఇప్పటి వరకూ స్పందించ లేదు. కానీ, ఈ విషయం పైన ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్రుష్టి సారించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఇదంతా చూస్తుంటే, ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా హ్యాకర్లు మరింతగా పెట్రేగి పోతున్నట్లు కనిపిస్తోంది మరియు ప్రజల సున్నితమైన డేటాని చిక్కులో పడేస్తున్నట్లు కూడ మనం అర్ధం చేసుకోవచ్చు.