boAt data breach: 75 లక్షల మంది boAt కస్టమర్ల పర్సనల్ డేటా ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టిన హ్యాకర్.!
boAt యొక్క కస్టమర్ల పర్సనల్ డేటా బ్రీచ్ అయ్యింది
డార్క్ వెబ్ లో 75 లక్షల మంది boAt కస్టమర్ల పర్సనల్ డేటా దర్శన మిచ్చింది
ఈ డేటాని డార్క్ వెబ్ లో ఒక హ్యాకర్ అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది
boAt data breach: ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ boAt యొక్క కస్టమర్ల పర్సనల్ డేటా బ్రీచ్ అయ్యింది. లోతైన లీక్స్ మరియు నల్ల వ్యాపారం జరిగే ప్రధాన ప్రాంతమైన డార్క్ వెబ్ లో 75 లక్షల మంది boAt కస్టమర్ల పర్సనల్ డేటా దర్శన మిచ్చింది. ఆధార్ కార్డ్ డేటా లీక్ వంటి వాటిని ఇప్పటికే ఆకళింపు చేసుకున్నాయి. అయితే, ఒక కంపెనీ యొక్క యూజర్ల రిస్క్ లో పడటం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, ప్రస్తుతం అనైతిక ఆన్లైన్ యుగంలో ఇదంత పెద్ద విషయం కాదని నిపుణులు చెబుతున్నారు.
boAt data breach
75 లక్షల మంది బోట్ యూజర్ల పర్సనల్ డేటా లీకైందని ముందుగా forbesindia వెల్లడించింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, పేరు, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడి, అడ్రెస్స్ మరియు కస్టమర్ ఐడి వంటి పర్సనలి ఐడెంటీఫైబుల్ ఇన్ఫర్మేషన్ (PII) లను డార్క్ వెబ్ లో ఒక హ్యాకర్ అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 5వ తేదీ ShopifyGUY పేరుతో ఒక హ్యాకర్ 75 లక్షల 50 వేల మంది బోట్ యూజర్ల పర్సనల్ డేటాని బ్రీఛ్ చేసినట్లు తెలిపాడు. అంతేకాదు, టోటల్ 2GB పరిమాణం కలిగిన ఈ పూర్తి డేటాని డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టాడు. అంతేకాదు, దీని పైన ద్రుష్టి సారించిన ఫోర్బ్స్ ఇండియా ఇందులోని కొంత మంది కస్టమర్లను రీసెంట్ గా బోట్ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసిన కస్టమర్లు గా గుర్తించినట్లు కూడా తెలిపింది.
ఇటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను బహిర్గం అవ్వడం ద్వారా యూజర్లకు అనేక చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, కాంటాక్ట్ నెంబర్, అడ్రెస్స్ మరియు ఇమెయిల్ వివరాలు స్కామర్ల చేతికి చిక్కితే, తరువాత జరిగే పరిణామాలు మనెను ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
Also Read: Gold Price: ముందెన్నడూ చూడని రికార్డ్ రేటును టచ్ చేసిన గోల్డ్ రేట్.!
ఇక ఈ హ్యాకర్ వివరాల్లోకి వెళితే, ఈ ShopifyGUY పేరుతో ఉన్న అకౌంట్ లేటెస్ట్ గా క్రియేట్ అయినా అకౌంట్ అని, ఈ అకౌంట్ నుండి ఇంతకు ముందు ఎప్పుడూ ఎటువంటి లీక్స్ జరగలేదని కూడా ఫోర్బ్స్ తెలిపింది. అయితే, ఈ విషయం గురించి కంపెనీకి చేసిన మెయిల్ కి ఎటువంటి రిప్లై అందలేదని కూడా ఫోర్బ్స్ తన నివేదికలో వెల్లడించింది.
ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ boAt యొక్క కస్టమర్ల పర్సనల్ డేటా బ్రీచ్ అయ్యింది. లోతైన లీక్స్ మరియు నల్ల వ్యాపారం జరిగే ప్రధాన ప్రాంతమైన డార్క్ వెబ్ లో 75 లక్షల మంది boAt కస్టమర్ల పర్సనల్ డేటా దర్శన మిచ్చింది. ఆధార్ కార్డ్ డేటా లీక్ వంటి వాటిని ఇప్పటికే ఆకళింపు చేసుకున్నాయి. అయితే, ఒక కంపెనీ యొక్క యూజర్ల రిస్క్ లో పడటం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, ప్రస్తుతం అనైతిక ఆన్లైన్ యుగంలో ఇదంత పెద్ద విషయం కాదని నిపుణులు చెబుతున్నారు.