డిసెంబర్ 8, 2017 నాటికి 712 మిలియన్ మొబైల్ నంబర్లు మరియు 820 మిలియన్ బ్యాంకు అకౌంట్స్ ఆధార్తో ఇప్పటికే లింక్ చేయబడ్డాయి

Updated on 28-Dec-2017

712 మిలియన్ కన్నా ఎక్కువ కనెక్షన్లు మరియు 820 మిలియన్ బ్యాంకు అకౌంట్స్ ఇప్పటికే 12 అంకెల ఆధార్ బయోమెట్రిక్ నెంబర్ తో ముడిపడి ఉన్నాయి. 712 మిలియన్ మొబైల్ కనెక్షన్లు నూతన మరియు ఇప్పటికే ఉన్న కనెక్షన్లు రెండింటిలో ఉన్నాయి. ఈ నెంబర్  డిసెంబరు 8, 2017 న, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇటీవలే ఆయన రాజ్యసభకు ఈ వార్తనిచ్చారు.

డిసెంబరు 8, 2017 నాటికి 71.24 కోట్ల మొబైల్ నంబర్లు (కొత్త, రీ -వెరిఫైడ్ ) 82 కోట్ల బ్యాంకు అకౌంట్స్  ఆధార్ తో  అనుసంధానించబడ్డాయి 'అని ప్రసాద్ తెలిపారు.ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తొలుత ఈ వార్త రిపోర్ట్ చేసింది , ఇటీవలి గడువు పొడిగింపుతో, మార్చి 31, 2018 వరకు టెలీకోస్  మొబైల్ కనెక్షన్లను వెరిఫై చేస్తాయని  ప్రసాద్ పేర్కొన్నారు.

మార్చి 31, 2018 వరకు మొబైల్ నంబర్లు, ఇతర సర్వీసులతో ఆధార్ను లింక్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఇటీవలే డేట్ ఎక్స్టెండ్ చేసింది . మొబైల్ నంబర్ల గడువు పొడిగింపుతో పాటు, పాన్ కార్డు, బ్యాంకుఅకౌంట్స్ , మరియు వెల్ ఫెయిర్  స్కీమ్స్  కి ఆధార్ లింకింగ్ డెడ్ లైన్ ని మార్చి 31 వరకు ఎక్స్ట్రెండ్ చేసింది  .ఈ సమయంలో, టెలికాం ఆపరేటర్లు డోర్ స్టెప్ ఆధార్ లింక్, క్యాష్బ్యాక్ ఆన్ లింకింగ్ విత్  ఆధార్ తో  సహా పలు కొత్త పద్ధతులతో ముందుకు వచ్చారు. 

 

 

 

 

 

Connect On :