శుభవార్త ! ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందుతున్న 2.5 లక్షల గ్రామ పంచాయితీలు:మనోజ్ సిన్హా
డిసెంబర్ 2018 వరకు దేశంలో 2.5 లక్షల గ్రామ పంచాయితీల కు ఇంటర్నెట్ కనెక్టివిటీ రెడీ
దేశంలో 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు 2018 వరకు ఇంటర్నెట్ చేర్చబడుతుంది. సమాచార మంత్రి మనోజ్ సిన్హా ఒక ప్రకటన ద్వారాగా ఈ విషయం తెలిపారు. రాజీవ్ సిన్హా లోక్ సభ లో మాట్లాడుతూ భారత్ నెట్ ప్రాజెక్ట్ క్రింద దేశం లోని అన్ని గ్రామ పంచాయతీలకు 100Mbps బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందిస్తామని తెలిపారు . ఈ పథకం కింద తొలి దశలో లక్ష పంచాయతీల్లో ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. ఈ లక్ష్యాన్ని మార్చి 2017 నాటికి పూర్తి కాగలదని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 2018 నాటికి , అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ చేర్చబడుతుంది. మనోజ్ సిన్హా ఇంకొక ముఖ్య విషయం కూడా తెలిపారు.
గ్రామ పంచాయతీలలో వైఫై హాట్ స్పాట్స్ ను కూడా క్రియేట్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు. ఆల్రెడీ మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వబడింది. మరియు ఈ పథకం కింద రెండు Wi-Fi హాట్ స్పాట్స్ ప్రతి గ్రామంలో పంచాయతీలో ఏర్పాటు చేయాలని యోచన చేస్తున్నారు.
నవభారత్ ప్రాజెక్ట్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ పనుల కింద పనిచేస్తుంది. ఈ పథకం లో వున్న గ్రామాలకు కూడా ఇంటర్నెట్ అందించే యోచన చేస్తుంది. ఈ పథకం కింద వాయువ్య రాష్ట్రాలలో 8,621 గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కనెక్ట్ అవుతుందని తెలిపారు.