ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను ఆకర్షించి, ప్రజాదరణ పొందిన పాపులర్ బ్యాటిల్ రాయల్ గేమ్, PUBG Mobile ఆడటం కోసం, ఒక హై-ఎండ్ సామ్రాట్ ఫోన్ను కొనుగోలు చేయడానికి అతని కుటుంబ సభ్యులు నిరాకరించిన కారణంగా, ఒక 19 ఏళ్ల బాలుడు తనకు తాను ఉరివేసుకున్నాడు.
ANI రిపోర్ట్ ప్రకారం, ఈ 19 ఏళ్ల బాలుడు, ముంబయిలోని కుర్లాలోని నెహ్రూ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతను ఈ గేమ్ ఆడడం కోసం 37,000 రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్ కోసం కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. అయితే, ఆ బాలుడు కోరిన డిమాండ్ తో కుటుంబసభ్యులు ఏకిభవించలేదు, రూ. 20,000 కంటే ఎక్కువ ధరతో ఉండే ఫోన్ కొనడానికి వారు అంగీకరించక పోవడంతో, ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన ముందురోజు రాత్రి, ఈ బాలుడు తన అన్నయ్యతో రాబోయే ఒక కొత్త స్మార్ట్ ఫోన్ గురించి తీవ్ర వాగ్వాదం చేసినట్లు, ముంబై మిర్రర్ చెబుతోంది. ఈ నివేదిక ఈ బాధితుడిని నదీమ్ షేక్ గా గుర్తించింది, అతను సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు మరియు అతని తల్లి, అన్నయ్య మరియు అతని భార్య మరియు పిల్లలతో నివసించాడు.
ఈ నివేదిక, నదీమ్ ఈ ఆట ఆడటానికి ఒక నిర్దిష్ట ఫోన్ కోసం ఎదురుచూస్తునట్లు పేర్కొంది. అయితే, అతని అన్నయ్య అతనికి స్మార్ట్ ఫోన్ కోసం రూ .20,000 ఇవ్వదానికి అంగీకరించినప్పటికీ, అతను పూర్తి మొత్తాన్ని కోరుకుంటూ మొండిగా వ్యవహరించాడు. అంతేకాదు, అన్నయ్య ఇచ్చిన డబ్బును కూడా అతను తిరిగి ఇచ్చేశాడు.
ఈ వాదన తరువాత, మిర్రర్ నివేదిక ప్రకారం, 2:00 AM వరకు కుటుంబ సభ్యులు నిద్రించే వరకు, నదీమ్ అతని ఫోన్లో గేమ్స్ అడుతూవున్నాడు. తరువాత, అన్నయ్య టాయిలెట్ కు వెళ్ళడానికి లేచాడు, అప్పుడు వంటగదిలోని పైకప్పు ఫ్యాన్ నుండి తాడుకి నదీమ్ బాడీ వేలాడుతుండడం గమనించాడు. పోలీసు దీన్ని యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేశారు.
PUBG మొబైల్ ఖచ్చితంగా చాల మంది ఆటగాళ్లని ఆకర్షించింది. కానీ ప్లేయర్లు, PC లేదా కన్సోల్ లలో ఎన్నడూ ఆడలేదు మరియు కేవలం మొబైల్ నుండే ఆడడాన్నే ఎక్కువగా ఎంచుకున్నారు. గేమ్ కూడా ఒక ముల్టీ ప్లేయర్ పర్యావరణంలో, అన్ని ఎలెమెంట్స్ కూడా గంటలు కొద్దీ కట్టిపడేశాలా ఉంటుంది. ఈ గేమ్ ఇటీవల Google ప్లే స్టోర్ ద్వారా ఉత్తమ Android గేమ్ గా కూడా ఎన్నికైనది, కానీ అది కూడా చాల ప్రతికూలవాతావరణాల నడుమ. ఒక 11 ఏళ్ల బాలుడు పిల్లలను తప్పు దోవను పట్టించే, ఈ గేమ్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఈ ఆటపై నిషేధం విధించాలని బొంబాయి హైకోర్టును ఆశ్రయించాడు.