PUBG Mobile Ban: పబ్జితో సహా మొత్తం 118 Chines Apps ను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం

PUBG Mobile Ban: పబ్జితో సహా మొత్తం 118 Chines Apps ను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం
HIGHLIGHTS

భారత ప్రభుత్వం PUBG Mobile తో సహా మొత్తం 118 Chines Apps పైన నిషేధం విధించింది.

PUBG మొబైల్ తో పాటుగా AFK Arena, Arena of Valor, Cyber Hunter, మరియు Mobile Legends వంటి ప్రముఖ గేమింగ్ యాప్స్ పైన భారత ప్రభత్వం నిషేధం విధించింది.

భారత ప్రజల డేటా సెక్యూరిటీకి భంగం వాటిల్లే కారణంగా, 118 Chines Apps పైన నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

PUBG Mobile Ban పైన ఇప్పటి వరకూ కేవలం రూమర్లు లేదా అంచనాలు మాత్రమే కనిపించేవి. అయితే,  ప్రభుత్వం PUBG Mobile తో సహా మొత్తం 118 Chines Apps పైన నిషేధం విధించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమైన డౌన్లోడ్ కలిగిన ఈ గేమింగ్ యాప్, ఇండియాలో అత్యధికంగా డౌన్ లోడ్స్ కలిగి వుంది. కేవలం ఇదొక్కటే కాదు, PUBG మొబైల్ తో పాటుగా AFK Arena, Arena of Valor, Cyber Hunter, మరియు Mobile Legends వంటి ప్రముఖ గేమింగ్ యాప్స్  పైన భారత ప్రభత్వం నిషేధం విధించింది.

ఇక విషయానికి వస్తే, భారత ప్రజల డేటా సెక్యూరిటీకి భంగం వాటిల్లే కారణంగా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ యొక్క సెక్షన్ 69 A  క్రింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Procedure and Safeguards for Blocking of Access of Information by Public) 2009 నియమాలు మరియు బెదిరింపుల యొక్క స్వభావం దృష్ట్యా ఈ 118 మొబైల్ యాప్స్ ని నిషేదించాలని నిర్ణయించింది.

ఇక PUBG Mobile విషయానికి వస్తే, ఆన్ ‌లైన్ ‌లో గేమ్స్ ను LIVE  ప్రసారం చేసే అనేక మంది భారతీయ గేమర్ ‌లకు PUBG మొబైల్ పెద్ద ఆదాయ వనరుగా మారింది. దీనికి తోడు, స్కౌటాప్ యొక్క ఇష్టాలు కూడా DrDisrespect తో సహకరించడంతో పెద్ద ఫాలోయింగ్ మరియు యూట్యూబ్ లో ఎక్కువ పేరును సంపాదించి పెట్టాయి. కాసుల పంట పండిస్తున్న ఈ PUBG Mobile ఇండియాలో ఇప్పుడు నిషేదానికి గురయ్యింది కాబట్టి గేమర్స్ ఇక కొత్త ప్రత్యామ్నాయాలను వెతకాల్సి రావచ్చు.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo