Free Fire Max గేమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన Pushpa 2: క్రేజ్ మామూలుగా లేదుగా.!
Pushpa 2: The Rule సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన అందుకుంది
వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న పుష్ప రాజ్ క్యారెక్టర్ ఇప్పుడు Free Fire గేమ్ లోకి ఎంటర్ అయ్యింది
పుష్ప రాజ్ థీమ్, స్టైల్ మరియు మరిన్ని ఫీచర్స్ తో ఎంట్రీ ఇచ్చినట్లు ఫ్రీ ఫైర్ ప్రకటించింది
Pushpa 2: The Rule సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన అందుకుంది. వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న పుష్ప రాజ్ క్యారెక్టర్ ఇప్పుడు ఏకంగా Free Fire గేమ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ ఎంట్రీ కేవలం నామమాత్రపు ఎంట్రీ కాదు, పుష్ప రాజ్ థీమ్, స్టైల్ మరియు మరిన్ని ఫీచర్స్ తో ఎంట్రీ ఇచ్చినట్లు ఫ్రీ ఫైర్ ప్రకటించింది. సినిమా చరిత్రలో భారీ రికార్డ్ లు కైవసం చేసుకుంటున్న పుష్ప 2 మూవీ ఇప్పుడు గేమింగ్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టింది.
Free Fire Max : Pushpa 2
పుష్ప 2 ది రూల్ మూవీ థియేట్రికల్ రిలీజ్ కోసం ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గేమ్ తో కొలాబరేషన్ చేసుకున్నట్లు గారేనా తెలిపింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా పుష్ప రాజ్ ప్రత్యేకమైన Pushpa 2: The Rule థీమ్ తో ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఈ అప్డేట్ తో థీమ్డ్ బండిల్, ఎమోట్, గ్లూ వాల్ మరియు ఐకానిక్ వాయిస్ లైన్స్ కూడా ఇందులో బండిల్ చేయబడ్డాయి.
ఈ కొత్త పుష్ప రాజ్ థీమ్ తో ఐకానిక్ పుష్ప రాజ్ గొడ్డలి మరియు పుష్ప రాజ్ యాటిట్యూడ్ ను కూడా ఈ గేమ్ లో జత చేసినట్లు తెలిపింది. దీనితో పాటు డైలీ మిషన్ లతో ఫ్రీ రివార్డ్స్ ను కూడా అందిస్తుంది. అంతేకాదు, ఎక్స్ క్లూజివ్ హర్గీస్ జుకేగా నహి ఏమోట్ ను కూడా ఆఫర్ చేస్తోంది.
Also Read: Phantom V Fold 2: 80 వేల బడ్జెట్ సూపర్ Fold ఫోన్ ను లాంచ్ చేసిన టెక్నో.!
పుష్ప 2 కోసం సినిమా యాజమాన్యం అన్ని కోణాల్లో ప్రమోట్ చేస్తోంది. ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్స్ సాధించినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి. పుష్ప 2 సినిమా 100 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.