PUBG ఇండియా సిరీస్ 2019 ఫైనల్స్ వేదికగా హైదరాబాద్ నగరం

Updated on 07-Mar-2019
HIGHLIGHTS

ఈ పోటీలో గెలుపొందేవారికి మొత్తంగా కలిపి 1 కోటి రూపాయల వరకు అందించనుంది.

అతికొద్దికాలంలోనే అమితమైన ప్రజాధారణ పొందింది PUBG మొబైల్ గేమ్. ఈ గేమ్ యొక్క 2019 ఇండియా మొదటి సిరీస్ ఇప్పుడు నిర్వహించనుంది. అయితే, ఇందులో ఆడదానికి అర్హత పొందడానికి మాత్రం PUBG మొబైల్ గేమ్ లో మీరు 20 వ లెవల్ నుండి పైన వున్నా వారికీ మాత్రమే వీలవుతుంది. అంతేకాదు, ఈ పోటీలో నెగ్గిన వారికీ భారీగా నగదు భామహుమతి కూడా అందిస్తోంది. ఈ పోటీని Oppo యొక్క భగస్వామ్యంతో PUBG నిర్వహిస్తోంది.

ఈ పోటీ మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి (1PM) మొదలవుతుంది. ప్రస్తుతం,ఈ పోటీకోసం 2,000 జట్లు ఎంపిక చేయబడ్డాయి. ఈ ఎంపిక చేయబడిన 2000 జట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 20 జట్లు ఫైనల్లో ఇప్పుడు జరగనున్న ఫైనల్లో పోటీపడతాయి. ఈ ఫైనల్లో మొదటి మొదటి టీం 30,00,000 ని ప్రైజ్ మనీగా అందుకుంటారు. రెండవ స్థానంలో నిలచిన వారు 10,00,000 రూపాయాలు అందుకున్నారు మరియు మూడవ స్థానంలో వున్నవారికి 5,00,000 రూపాయల ప్రైజ్ మని అందిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ పొందిన  గేమ్ ముందుగా నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్ షిప్ యొక్క ఫైనల్ ని దుబాయ్ లో నిర్వహించింది. ఇక ప్రస్తుతం ఇండియాలో నిర్వహిస్తున్న ఈ సిరీస్ యొక్క ఫైనల్ ని తెలంగాణా ప్రభుత్వం యొక్క సహాయంతో హైదరాబాద్ లో నిర్వహస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :