PUBG ఆడుతూ ఆగిన గుండె: అత్యుత్సాహమే కారణం, తస్మాత్ జాగ్రత్త

Updated on 19-Jan-2020
HIGHLIGHTS

ఆ సమయంలో PUGB మొబైల్ ఆడటలో ఎక్కువగా ఎగ్సైట్ మెంట్ అయ్యాడు.

PUBG మొబైల్, భారతీయ మొబైల్ గేమింగ్ మార్కెట్‌ ను పెనుతుఫానుగా అల్లుకుంది మరియు ఇప్పుడు యువత ఎక్కువగా సంభాషించే విషయాలల్లో భాగంగా మారింది. కానీ, దాని ప్రభావం అంతా బాగానే లేదు. శనివారం, PUBG మొబైల్ ఆడుతూ మహారాష్ట్రలో ఒక వ్యక్తి మరణించినట్లు తెలిసింది. ఇప్పుడు, ఇది సాధారణమైన విషయమే, అని అనుకోకండి. ఎందుకంటే, వైద్యులు చెప్పినదాని ప్రకారం, 25 ఏళ్ల వ్యక్తి ఇంట్రాసెరెబ్రల్ బ్లీడింగ్ (అంతర్గత రక్త స్రావం) కావడం వలన  మరణించాడు. ఎందుకంటే, అతను ఆ సమయంలో PUGB మొబైల్ ఆడటలో ఎక్కువగా ఎగ్సైట్ మెంట్ అయ్యాడు.

ఇక అసలు విషయానికి వస్తే, ఓ వ్యక్తి గురువారం ఈ గేమ్ ఆడుతున్నాడని, కొద్దిసేపటికే స్ట్రోక్‌ కు గురయ్యాడని తెలిసింది. అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. శవపరీక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైద్యుడు, “ఆన్‌ లైన్ గేమ్ PUBG ఆడుతున్నప్పుడు బాధితుడు అత్యుత్సాహం (ఎగ్సైట్ మెంట్) తో ఉన్నందున స్ట్రోక్ సంభవించినట్లు అనిపిస్తుంది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ మెదడు కణజాల నెక్రోసిస్‌ తో ఇంట్రాసెరెబ్రల్ బ్లీడింగ్ మరణానికి కారణమని పేర్కొంది ”.

స్పష్టంగా, ఆట వేర్వేరు వ్యక్తులపై విభిన్న ప్రభావాలను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే, కొందరు  జాగ్రత్తగా లేకపోతే అది స్ట్రోక్‌ లకు కూడా కారణం కావచ్చు. మీకు ఇప్పటికే తెలియకపోతే, PUBG మొబైల్ అనేది PC లోని ప్రసిద్ధ బ్యాటిల్ రాయల్ గేమ్ యొక్క మొబైల్ వెర్షన్. ఇది కేవలం కొద్ది సంవత్సరాలలోనే, గేమింగ్ ప్లాట్ఫారం పైన అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో ఒకటిగా మారింది మరియు ఇది ఇప్పటికీ కొత్త అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :