Google Gemini: చాట్ జిపిటి కి పోటీగా కొత్త AI Model ని తెచ్చిన గూగుల్.!
చాట్ జిపిటి కి పోటీగా కొత్త AI Model ని
Google Gemini పేరుతో తీసుకు వచ్చిన Google
గూగుల్ ముందుగా తీసుకు వచ్చిన బార్డ్స్ కంటే మరింత అడ్వాన్స్డ్ మోడల్
ప్రపంచ అతిపెద్ద టెక్ దిగ్గజం గూగుల్ చాట్ జిపిటి కి పోటీగా కొత్త AI Model ని అనౌన్స్ చేసింది. Google Gemini పేరుతో తీసుకు వచ్చిన ఈ AI మోడల్ చాట్ జిపిటి కంటే మరింత యాక్యురేట్ గా ఉంటుందని తెలిపి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, ఈ కొత్త మోడల్ ను మనిషి లాగ ఆలోచించేలా తీసుకు వచ్చినట్లు కూడా చెబుతోంది. ఈ కొత్త గూగుల్ జెమిని అనేదిటెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో మరియు కోడింగ్ ల మిశ్రమ మోడల్ అని కూడా గూగుల్ చెబుతోంది.
Google Gemini
మెరుగైన జీవన శైలి, హ్యూమన్ ప్రోగ్రెస్ ను మరింత పెంచడానికి మరియు మరింత అడ్వాన్స్ సైంటిఫిక్ డిస్కవరీస్ కోసం టెక్నాలజీ మరింతగా పెరుగుతోంది. అయితే, చాలా విషయాల్లో మాత్రం ఇప్పటికి కూడా ఎల్లలు విధించబడ్డాయి. ఈ ఎల్లలు చేర్పివేసే మార్గమే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) . అటువంటి AI దైనందిన జీవితంలో ఎలా సహాయం చేస్తుందనే దానికి గూగుల్ జెమిని నిదర్శనంగా నిలుస్తుందని గూగుల్ తెలిపింది.
Also Read : Redmi 13C: తక్కువ ధరలో 50MP AI ట్రిపుల్ కెమేరా ఫోన్ లాంచ్.!
అసలు ఏమిటి గూగుల్ జెమిని?
గూగుల్ జెమిని అనేది గూగుల్ ముందుగా తీసుకు వచ్చిన బార్డ్స్ కంటే మరింత అడ్వాన్స్డ్ మోడల్. ఇది లేటెస్ట్ చాట్ జిపిటి కంటే మరింత అడ్వాన్స్ గా ఉంటుందని కూడా తెలిపింది. అంతేకాదు MMLU (మ్యాసివ్ మల్టీటాస్క్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్) పైన మనిషి లాగా ఆలోచన చేసే మొదటి మోడల్ అని కూడా పేర్కొంది.
గూగుల్ జెమిని, అల్ట్రా, ప్రో మరియు నానో, మూడు రకాల ప్రమాణాల్లో వస్తుంది. జెమిని నానో అనేది డివైజ్ లలో మోస్ట్ ఎఫిషియంట్ మోడల్ గా, జెమిని ప్రో మోడల్ అనేది వైడ్ రేంజ్ టాస్క్ ల కోసం సరిపోతుంది. అయితే, జెమిని అల్ట్రా అనేది అత్యంత కఠినమైన టాస్క్ లను కూడా నిర్వహించ గలదని వివరించింది.
ఈ కొత్త AI మోడల్ జెమిని మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ మరియు చాలా ఎఫిషియంట్ గా పని చేస్తుందని గూగుల్ చెబుతోంది.