PUBG కి పోటీగా రానున్న కొత్త భారతీయ గేమ్ FAU-G

PUBG కి పోటీగా రానున్న కొత్త భారతీయ గేమ్ FAU-G
HIGHLIGHTS

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని షోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా వెల్లడించారు.

ఈ మొబైల్ గేమ్ ని FAU-G అనే పేరుతొ తీసుకురానునట్లు కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20% " భారత్ కే వీర్ " ట్రస్ట్ కి ఇవ్వనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన PUBG మొబైల్ గేమ్ తో సహా మొత్తం 118 యాప్స్ ని భారత ప్రభుత్వం నిషేధించిన కొద్ది రోజుల్లోనే ఈ PUBG మొబైల్ ఆన్లైన్ మల్టి ప్లేయర్ గేమ్ కు ప్రత్యామ్నాయంగా మరియు పోటీ గేమ్ ప్రకటించబడింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని షోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ఈ మొబైల్ గేమ్ ని FAU-G అనే పేరుతొ తీసుకురానునట్లు కూడా తన ట్వీట్ లో పేర్కొన్నారు.             

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలిపునిచ్చిన "ఆత్మ నిర్బర్ భారత్" స్పూర్తితో ఈ Fearless And United – Guards షార్ట్ ఫామ్ లో FAU-G ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. అధనంగా, ఈ గేమ్ ద్వారా ప్లేయ్సర్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా మన దేశ సైనికుల త్యాగాలను కూడా తెలుసుకునేలా ఈ గేమ్ ఉండనుంది.  అన్నింటికన్నా ప్రదమైన విషయం ఏమిటంటే, ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20% " భారత్ కే వీర్ " ట్రస్ట్ కి ఇవ్వనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్రింద చూడవచ్చు.

 

 

ప్రస్తుతం, ఇండియాలో PUBG వంటి మరికొన్ని మల్టి ప్లేయర్ మరియు ఆన్లైన్ గేమ్స్ ని నిషేధించిన తరువాత, ఇండియాలో ప్రారంభించనున్న కొత్త గేమింగ్ యాప్స్ కి సరైన సమయం కూడా అవుతుంది. ఈ గేమ్ కనుక మంచి గ్రాఫిక్స్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చినట్లయితే, PUBG కి సరైన పోటీధారుగా ఎదుగుతుంది.         

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo