BGMI 3.5 Update: కొత్త మోడ్స్ మరియు ఫీచర్స్ తో అప్డేట్ రోల్ అవుట్ అయ్యింది.!

BGMI 3.5 Update: కొత్త మోడ్స్ మరియు ఫీచర్స్ తో అప్డేట్ రోల్ అవుట్ అయ్యింది.!
HIGHLIGHTS

BGMI 3.5 Update ను ఎట్టకేలకు విడుదల చేసింది

BGMI యాప్ ఇప్పుడు మేజర్ అప్డేట్ ను అందుకుంది

ఈ గేమ్ కొత్త మోడ్స్ మరియు ఫీచర్స్ ను అందుకుంటుందని కూడా తెలిపింది

BGMI 3.5 Update ను ఎట్టకేలకు విడుదల చేసింది. ఇండియాలో విడుదలైన నాటి నుంచి కొత్త రెగ్యులర్ అప్డేట్ లు మాత్రమే అందుకున్న ఈ గేమింగ్ యాప్ ఇప్పుడు మేజర్ అప్డేట్ ను అందుకుంది. ఈ కొత్త అప్డేట్ తో ఈ గేమ్ కొత్త మోడ్స్ మరియు ఫీచర్స్ ను అందుకుంటుందని కూడా తెలిపింది. ఇంకేముంది BGMI గేమ్ ను అమితంగా ఇష్టపడే యూజర్లకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది.

BGMI 3.5 Update

బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) కొత్త 3.5 అప్డేట్ ను విడుదల చేసింది. ఈ అప్డేట్ ను Android మరియు iOS కోసం కూడా విడుదల చేసింది. ఈ కొత్త అప్డేట్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త అప్డేట్ ను మోడ్స్ మరియు ఫీచర్స్ తో తీసుకు వచ్చింది. ఈ కొత్త అప్డేట్ లో క్విక్ గేమ్ మోడ్స్ ను అందించింది.

BGMI 3.5 Update విశేషాలు ఏమిటి?

బిజిఎమ్ఐ కొత్త 3.5 అప్డేట్ లో కొత్త క్విక్ మోడ్ లను అందించింది. ఈ కొత్త మోడ్ లతో చాలా తక్కువ సమయం ప్లే టైం కలిగిన గేమ్ అందించింది. ఇది కాకుండా కొత్త సిటీ ఫ్రాంటియర్ డ్రాప్ సిటీ, డ్రాగన్ బాస్ ను ఎదుర్కోవడానికి వార్ హమ్మర్ ను అందించింది. అంతేకాదు, ఎపిక్ ఫైట్స్ కోసం కొత్త ఐస్ సోల్ స్పియర్ ను కూడా అప్డేట్ తో జత చేసింది.

ఇది కాకుండా అండర్ గ్రౌండ్ టన్నల్స్, ఐస్ బ్లాక్ బ్రేకింగ్ మరియు సెబర్ టూత్ టైగర్ ని కూడా జత చేసింది. ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో వున్నChieftain రూమ్ ను కూడా గేమర్స్ ఇప్పుడు చేరుకోవచ్చు.

Also Read: Jio Latest Plan: జియో బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ 5G ప్లాన్ పై ఒక లుక్కేయండి.!

ఇవి కాకుండా కొత్త అప్డేట్ తో చాలా గేమ్ ఐటమ్స్ మరియు గొప్ప రివార్డ్స్ గెలుచుకోవడానికి వీలైన కొత్త బ్యాటిల్ పాస్ ను కూడా అందిస్తుంది. మీరు కూడా బిజిఎమ్ఐ గేమ్ ప్రియులు అయితే కొత్త అప్డేట్ డౌన్ లోడ్ చేసుకొని కొత్త గేమ్ ను ఎంజాయ్ చేయండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo