Pushpa 2 Reloaded Version: 20 నిమిషాల నిడివి కొత్త ఫుటేజీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఫిలిం మేకర్స్.!
Pushpa 2 Reloaded Version డేట్ కన్ఫర్మ్ చేసిన ఫిలిం మేకర్స్
20 నిమిషాల నిడివి గల సూపర్ సీన్స్ ను యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది
జపాన్ సీక్వెన్స్ సీన్స్ తో ఈ 20 నిమిషాల ఫుటేజ్ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి
Pushpa 2 Reloaded Version డేట్ కన్ఫర్మ్ చేశారు ఈ సినిమా ఫిలిం మేకర్స్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప 2 ఇప్పటికే ఒక్కొక్క రికార్డు బద్దలు కొడుతూ కొత్త రికార్డులు వైపు దూసుకు పోతోంది. ఈ సినిమా ఇప్పటికే RRR మరియు బాహుబలి 2 రికార్డు లైఫ్ టైమ్ కలెక్షన్ బద్దలు కొట్టి ఇంకా ముందుకు సాగిపోతోంది. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే మరొక న్యూస్ ను ఫిలిం మేకర్స్ ప్రకటించారు. పుష్ప 2 సినిమా కి 20 నిమిషాల నిడివి గల సూపర్ సీన్స్ ను యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Pushpa 2 Reloaded Version
సంక్రాంతి 2025 పండుగ కి ముందు ఈ సినిమా 20 నిమిషాల ఫుటేజ్ తో థియేటర్లో ప్రదర్శించబడుతుంది. ఈ విషయాన్ని పుష్ప 2 సినిమా నిర్మాణ సంస్థ Mythri Movie Makers అనౌన్స్ చేసింది. ఈ సంస్థ యొక్క అధికారిక X (ఒకప్పుడు ట్విట్టర్) అకౌంట్ నుంచి అధికారికంగా ప్రకటించింది.
పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ జనవరి 11న రిలీజ్ అవుతుంది. జనవరి 11 నుంచి పుష్ప 2 ది రూల్ సినిమా 20 నిమిషాల అదనపు ఫుటేజీ తో ప్రదర్శించబడుతుంది. జపాన్ సీక్వెన్స్ సీన్స్ తో ఈ 20 నిమిషాల ఫుటేజ్ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త అప్డేట్ తో అందించిన ట్వీట్ నుంచి ‘The WILDFIRE gets extra FIERY’ క్యాప్షన్ తో టీజింగ్ చేస్తోంది.
Also Read: Realme Narzo 70 Turbo 5G పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన రియల్ మీ.!
ఇప్పటికే పుష్ప 2 వరల్డ్ వైడ్ 1831 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి బాహుబలి రికార్డ్ ను దాటి ముందుకు సాగుతోంది. ఇక పుష్ప 2 సినిమా ముందు నిలిచి వుంది బాలీవుడ్ సినిమా ‘దంగల్’ యొక్క వరల్డ్ వైడ్ రూ. 2059 కోట్ల రూపాయల కలెక్షన్ రికార్డ్ మాత్రమే. పండుగ ముందు ఈ కొత్త అప్డేట్ అందించడం చూస్తుంటే, మిగిలిన ఈ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలో పుష్ప 2 ది రూల్ ని హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలబెట్టాలని మేకర్స్ యోచిస్తున్నట్లు అనిపిస్తోంది.