Pushpa 2 సినిమా OTT లో చూడాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!
![Pushpa 2 సినిమా OTT లో చూడాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.! Pushpa 2 సినిమా OTT లో చూడాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.!](https://static.digit.in/Pushpa-2-releasing-on-netflix-ott-on-tomorrow-1.jpg)
Pushpa 2 సినిమా OTT లో చూడాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్
పుష్ప 2 ఇప్పుడు OTT బాట పట్టింది
సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత OTT రిలీజ్ కి సిద్దమయ్యింది
Pushpa 2 సినిమా OTT లో చూడాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. అల్లు అర్జున్ రష్మిక మందన్న బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’ ప్రపంచ వ్యాప్తంగా గొప్ప విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం మరియు అల్లు అర్జున్ నటన పరంగా ప్రశంసలు అందుకున్న పుష్ప 2 ఇప్పుడు OTT బాట పట్టింది. డిసెంబర్ 5 న థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత OTT రిలీజ్ కి సిద్దమయ్యింది.
Pushpa 2 OTT రిలీజ్ ఎప్పుడు?
పుష్ప 2 ది రూల్ సినిమా జనవరి 30న OTT లో రిలీజ్ అవుతుంది. అయితే, ఈ సినిమా రిలీజ్ అయ్యే టైమ్ ను మాత్రం ప్రకటించలేదు.
Also Read: Dor Play: 300 టీవీ ఛానల్స్ మరియు 20+ OTT లను సింగిల్ క్లిక్ తో అందించే సూపర్ యాప్ వచ్చేస్తోంది.!
Pushpa 2 ఏ OTT ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతుంది?
పుష్ప 2 ది రూల్ సినిమా Netflix లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా OTT రైట్స్ ను అధిక మొత్తం చెల్లించి నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ముందుగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా యొక్క రీలోడ్ వెర్షన్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేస్తుందని కూడా నెట్ ఫ్లిక్స్ యాప్ లో టీజింగ్ చేస్తోంది.
Netflix యాప్ లోని New & Hot కేటగిరిలో పుష్ప 2 ది రూల్ సినిమా యొక్క రెండు వెర్షన్ లను లిస్ట్ చేసింది. ఇందులో ఒక వెర్షన్ ను 3 గంటల 22 నిమిషాల నిడివి తో లిస్ట్ చేసింది మరియు ఇది రేపు రిలీజ్ అవుతుందని డేట్ లిస్ట్ చేసింది. పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వెర్షన్ ను త్వరలో లాంచ్ చేస్తుందని లిస్ట్ చేసింది. అయితే, ఈ సినిమాని Coming Soon ట్యాగ్ తో అందించింది. అందుకే, పుష్ప 2 ది రూల్ సినిమా డేట్ గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.