mahesh babu voice over movie Mufasa The Lion King OTT release date announced
ప్రిన్స్ మహేష్ బాబు గాత్రదానం చేసిన Mufasa The Lion King OTT రిలీజ్ డేట్ వచ్చేసింది. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు నవ్వుల బ్రహ్మ బ్రహ్మానందం మరియు ఆలీ కూడా ఈ సినిమాకు గాత్ర దానం చేశారు. సినిమా థియేటర్ లలో నవ్వుల పువ్వులు పండించడమే కాకుండా సూపర్ విజువల్స్ తో విజువల్ వండర్ గా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు OTT లో రిలీజ్ కావడానికి సిద్ధం అయ్యింది.
ముఫాసా ది లయన్ కింగ్ సినిమా మార్చి 26వ తేదీ ఓటీటీ లో రిలీజ్ అవుతుంది. అంటే, వచ్చే బుధవారం ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా JioHotstar ప్లాట్ ఫామ్ పై రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం మరియు హిందీ మొత్తం నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఓవరాల్ 1 గంట 57 నిమిషాల నిడివితో ఉంటుంది.
ముఫాసా ది లయన్ కింగ్ కోసం ప్రిన్స్ మహేష్ బాబు గాత్రదానం చేశారు. సినిమా మెయిన్ హీరో ముఫాసా కోసం ఆయన వాయిస్ ఓవర్ అందించారు. అలాగే, పుంబా కోసం హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారు వాయిస్ ఓవర్ అందించగా, పుంబా ఫ్రెండ్ టిమోన్ కోసం నటుడు అలీ, ఫ్రెండ్ టాకా క్యారెక్టర్ కోసం సత్య దేవ్ మరియు విలన్ కిరోస్ క్యారెక్టర్ కోసం అయ్యప్ప పి శర్మ గాత్రదానం చేశారు.
Also Read: Infinix Note 50x 5G+: AIGC పోర్ట్రైట్ కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
ఈ హాలీవుడ్ సినిమా నిర్మించడానికి $200 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $712.7 మిలియన్ డాలర్లు వాసులు చేసింది. అంటే, మన కరెన్సీలో సుమారు 58 వేల కోట్ల రూపాయలు.
ఈ సినిమా అందరూ చూడతగిన క్లీన్ మూవీ మరియు పిల్లలు ఇష్టంగా చూస్తారు.