Pushpa 2: The Rule: బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్న పుష్ప 2 టికెట్స్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి.!
Pushpa 2: The Rule సినిమా భారీ సంఖ్యలో థియేటర్ లలో రిలీజ్ అయ్యింది
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్పందన అందుకుంది
ఈ సినిమా టికెట్ ను థియేటర్ కి వెళ్ళి అందుకోవడమే కష్టమే
Pushpa 2: The Rule సినిమా భారీ సంఖ్యలో థియేటర్ లలో రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్పందన అందుకుంది. Pushpa : The Rise సినిమా పొడిగింపుగా (పార్ట్ 2) గా ఈ సినిమా వచ్చింది. పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన అందుకోవడమే కాకుండా ఏళ్లకు`అల్లూ అర్జున్ కి నేషనల్ అవార్డు ను సైతం తెచ్చి పెట్టింది. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా టికెట్ ను థియేటర్ కి వెళ్ళి అందుకోవడమే కష్టమే. అందుకే, పుష్ప ది రూలర్ సినిమా టికెట్స్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి.
Pushpa 2: The Rule
పుష్ప 2 సినిమా ఈరోజు నుంచి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఈరోజు బెనిఫిట్ షో తో మొదలయ్యింది మరియు #Wildfirepushpa హ్యాష్ ట్యాగ్ తో x ప్లాట్ ఫేమ్ పై ట్రేండింగ్ అవుతోంది. ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 100 కోట్ల రూపాయల సాధించినట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇది సరికొత్త హైయెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ ను నెలకొల్పింది.
పుష్ప 2 సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు 40,000 షోలను రిలీజ్ చేసినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఖచ్చితమైన లెక్కలు ఇంకా బయటికి రాలేదు. అయితే, ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మాత్రం భారీ సంఖ్యలో జరిగినట్లు తెలుస్తోంది.
పుష్ప 2 ది రూలర్ సినిమా ను ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం చాలా సులభం. క్యూ లో నిలబడకుండా చాలా ఈజీగా ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. bookmyshow నుంచి పుష్ప 2 సినిమా టికెట్స్ చాలా సులభంగా బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, మీకు నచ్చిన వరుసలో సీట్ లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. bookmyshow యాప్ లేదా వెబ్సైటు ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
Also Read: Moto G35 5G: బడ్జెట్ 4K వీడియో రికార్డింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.!
ఒక అందరికీ సుపరిచితమైన UPI యాప్ Paytm ద్వారా కూడా పుష్ప 2 సినిమా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.