పెద్ద స్క్రీన్ మరియు కాంపాక్ట్ డిజైన్ తో కొత్త Projectors లాంచ్ చేస్తున్న Zebronics
Zebronics కొత్త Projectors లాంచ్ చేయనునట్లు ప్రకటించింది
పెద్ద స్క్రీన్ మరియు కాంపాక్ట్ డిజైన్ తో లాంచ్ చేయబోతున్నట్లు జీబ్రానిక్స్ తెలిపింది
జీబ్రానిక్స్ యొక్క Pixa Play సిరీస్ నుండి ప్రొజెక్టర్ లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది
ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Zebronics కొత్త Projectors లాంచ్ చేయనునట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ ప్రొజెక్టర్ లను పెద్ద స్క్రీన్ మరియు కాంపాక్ట్ డిజైన్ తో పాటు మరిన్ని ట్రెండీ ఫీచర్లతో లాంచ్ చేయబోతున్నట్లు జీబ్రానిక్స్ తెలిపింది. Pixa Play సిరీస్ నుండి ఈ రెండు ప్రొజెక్టర్ లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Zebronics Projectors
జీబ్రానిక్స్ యొక్క Pixa Play సిరీస్ నుండి Pixa Play 53 మరియు Pixa Play 58 ప్రొజెక్టర్ లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రొజెక్టర్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఈ అప్ కమింగ్ ప్రొజెక్టర్స్ ఫీచర్స్ మరియు స్పెక్స్ ను కూడా కంపెనీ ముందే వెల్లడించింది.
Pixa Play 53: ఫీచర్స్
పిక్సాప్లే 53 ప్రొజెక్టర్ గరిష్టంగా 120 ఇంచ్ స్క్రీన్ (305cm) వరకూ సపోర్ట్ చేస్తుంది మరియు FHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ క్వాడ్ కొర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు క్యాస్టింగ్ & మిర్రరింగ్ ఫీచర్ లతో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ గరిష్టంగా 3500 లుమెన్స్ తో ఉంటుంది మరియు 50 వేల గంటల లైఫ్ లాంగ్ LED తో వస్తుంది.
ఇది స్మార్ట్ ప్రొజెక్టర్ మరియు యాప్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ బ్లూటూత్, HDMI, USB మరియు AUX సపోర్ట్ తో పాటు 2.4GHz WiFi కనెక్టివిటీ సపోర్ట్ తో ఉంటుంది. ఇందులో ఇన్ బిల్ట్ పవర్ ఫుల్ స్పీకర్ కూడా వుంది. ఈ ప్రొజెక్టర్ ను జూన్ 22వ తేదీ విడుదల చేస్తుంది.
Also Read: Realme Buds Air 6 Pro: కొత్త బడ్స్ తెచ్చిన రియల్ మీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!
Pixa Play 58: ఫీచర్స్
ఇది ఈ సిరీస్ లో పెద్ద స్క్రీన్ సపోర్ట్ తో వచ్చే ప్రొజెక్టర్ అవుతుంది. ఎందుకంటే, ఈ ప్రొజెక్టర్ 150 ఇంచ్ బిగ్ స్క్రీన్ సపోర్ట్ తో ఉంటుంది. ఇది కూడా FHD రిజల్యూషన్ అందించే ప్రొజెక్టర్ మరియు ఫోకస్ & కీ స్టోన్ అడ్జెస్ట్మెంట్ తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ గరిష్టంగా 11,500 లుమెన్స్ తో ఉంటుంది మరియు 50 వేల గంటల లైఫ్ లాంగ్ కలిగిన LED లైట్ తో వస్తుంది.
ఈ ప్రొజెక్టర్ లో కూడా క్యాస్టింగ్ & మిర్రరింగ్ ఫీచర్ లతో ఉంది. అలాగే, ఈ ప్రొజెక్టర్ బ్లూటూత్ 5.0, AUX అవుట్, AV ఇన్, 3 HDMI , 2 USB పోర్ట్ లతో పాటు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ ఆప్షన్ ను కూడా కలిగివుంది. ఇందులో కూడా పవర్ ఫుల్ ఇన్ బిల్ట్ స్పీకర్లు ఉన్నాయి.