జెబ్రోనిక్స్ ఇండియాలో కొత్తగా రెండు Smart Projector లను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ లను బడ్జెట్ ధరలో పెద్ద స్క్రీన్ తో అందించింది. అంతేకాదు, ఈ ప్రొజెక్టర్ లో స్మార్ట్ ఫీచర్లను మరియు 4K సపోర్ట్ ను కూడా అందించింది. ఎక్కువ స్థలం తీసుకొని చాలా కాంపాక్ట్ సైజులో ఈ ప్రొజెక్టర్ లను అందించింది.
జెబ్రోనిక్స్ ఇండియాలో రెండు కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ లను విడుదల చేసింది. ZEB-PIXAPLAY 58 మరియు Pixaplay 53 ప్రొజెక్టర్ లను వరుసగా రూ. 19,999 మరియు 11,999 రూపాయల ధరలతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ లు అమెజాన్ మరియు జెబ్రోనిక్స్ అధికారిక వెబ్సైట్ నుండి సేల్ అవుతున్నాయి. ఈ ప్రొజెక్టర్ ల పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను కూడా ఆఫర్ చేస్తోంది అమెజాన్. ఆఫర్స్ చెక్ చేయడానికి Click Here
జెబ్రోనిక్స్ సరికొత్తగా విడుదల చేసిన ఈ ప్రొజెక్టర్ గరిష్టంగా 210 ఇంచ్ సైజు స్క్రీన్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ ను 1080p నేటివ్ 4K సపోర్ట్ తో అందించింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు గరిష్టంగా 11,500 లుమెన్స్ బ్రైట్నెస్ లైట్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ బ్లూటూత్, HDMI, USB, WIFI, AUX, Miracast మరియు యాప్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో మంచి సౌండ్ అందించగల పవర్ ఫుల్ స్పీకర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రొజెక్టర్ లో ఫోకస్ అడ్జెస్ట్మెంట్ కోసం ప్రత్యేకమైన కీ స్టోన్ అడ్జెస్టుమెంట్ బటన్ కూడా వుంది.
Also Read: మీ Aadhaar Card లో అడ్రస్ ను మీరే స్వయంగా అప్డేట్ చేసుకోండి.!
ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ కూడా స్మార్ట్ ఫీచర్లను కలిగి వుంది. ఈ ప్రొజెక్టర్ 120 ఇంచ్ స్క్రీన్ ను 1080p నేటివ్ 4K సపోర్ట్ తో కలిగి వుంది. ఇది కూడా క్వాడ్ కోర్ ప్రొసెసర్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ ఇన్ బిల్ట్ స్పీకర్ ను కలిగి వుంది. ఇందులో కూడా HDMI, USB, WIFI, AUX, Miracast మరియు యాప్ సపోర్ట్ ఉన్నాయి. ఇది చాలా చిన్నగా కాంపాక్ట్ సైజులో ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ ప్రొజెక్టర్ 50,000 గంటల లైఫ్ టైం కలిగిన 3500 లుమెన్స్ లైట్ తో వస్తుంది.