Redmi Buds 5: ఇండియాలో కొత్త బడ్స్ ను లేటెస్ట్ ఫీచర్స్ తో లాంఛ్ చేస్తున్నట్లు షియోమి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను 46db హైబ్రెడ్ ANC వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంఛ్ చేయబోతున్నట్లు టీజ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ట్రూ వైర్లెస్ బడ్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో రెడ్ మి ఆటపట్టిస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ఊరించి కంపెనీ చెబుతున్న ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దాం.
రెడ్ మి బడ్స్ 5 ను #SuperBuds హ్యాష్ ట్యాగ్ తో తీసుకు వస్తోంది మరియు ఫిబ్రవరి 12న ఈ బడ్స్ ను లాంఛ్ చేస్తుంది. ఈ రెడ్ మి అప్ కమింగ్ బడ్స్ మంచి స్టైలిష్ డిజైన్ తో కనిపిస్తున్నాయి. ఈ బడ్స్ లో 46db హైబ్రిడ్ ANC ఉన్నట్లు మరియు ఇందులో మ్యూజిక్ ను మరింత ఆస్వాదించ వచ్చని రెడ్ మి టీజింగ్ చేస్తోంది. ఈ రెడ్ మి బడ్స్ లో 12.4mm స్పీకర్లను అందించడం ద్వారా పవర్ ఫుల్ BASS ను అందిస్తాయని కూడా తెలిపింది.
అంతేకాదు, ఇందులో డిఫరెంట్ సౌండ్ మోడ్స్ తో సౌండ్ ను మార్చుకునే వీలుందని కూడా హింట్ ఇచ్చింది. రెడ్ మి బడ్స్ 5 డ్యూయల్ డివైజ్ పెయిరింగ్ తో రెండు డివైజ్ ల మధ్య స్విచ్ చేసే వీలుంది. ఎటువంటి అంతరాయం లేకుండా మంచి కాలింగ్ కోసం అందించడానికి వీలుగా AI వాయిస్ ఎన్ హెన్స్మెంట్ కలిగిన డ్యూయల్ మైక్ సెటప్ కూడా ఉన్నట్లు తెలిపింది.
Also Read: దడపుట్టిస్తున్న డీప్ ఫేక్.. ఒక్కకాల్ తో 200 కోట్లు స్వాహా | Tech News
రెడ్ మి బడ్స్ 5 టోటల్ 38 గంటల ప్లేటైమ్ ను అందించే శక్తితో ఉంటుందని మరియు వేగంగా ఛార్జ్ చెయ్యగల టైప్ C సపోర్ట్ తో వస్తుంది. అయితే, వాస్తవానికి ఈ రెడ్ మి బడ్స్ 5 గ్లోబల్ మార్కెట్ లో ఇప్పటికే లాంఛ్ చేయబడి సేల్ కూడా అవుతున్నాయి. అంతేకాదు, ఈ బడ్స్ ప్రో వెర్షన్ అయిన రెడ్ మి బడ్స్ 5 ప్రో కూడా గ్లోబల్ మార్కెట్ లో లాంఛ్ అయ్యాయి. కానీ, ఇండియాలో ప్రో వెర్షన్ ప్రస్తావని ఇంకా బయటకి రాలేదు.