Dolby మరియు DTS సౌండ్ టెక్నాలజీతో వచ్చిన Xiaomi సౌండ్ బార్
Xiaomi లేటెస్ట్ సౌండ్ బార్ వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వచ్చింది
DTS: Virtual X వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్
ఈ సౌండ్ బార్ టోటల్ 430W అవుట్ పుట్ తో ఉంటుంది
Xiaomi లేటెస్ట్ గా మార్కెట్లోకి హెవీ సౌండ్ అందించగల సౌండ్ బార్ ను విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ముందుగా వచ్చిన సౌండ్ బార్ మాదిరిగా కాకుండా వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వచ్చింది . అంతేకాదు, Dolby Audio, DTS డిజిటల్ సరౌండ్ మరియు DTS: Virtual X వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఈ సౌండ్ బార్ ను ప్రకటించింది. లేటెస్ట్ గా షియోమి తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ గురించి కంప్లీట్ గా తెలుసుకోండి.
Xiaomi 3.1SoundBar:
షియోమి ఈ Xiaomi 3.1SoundBar ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సౌండ్ బార్ ను వైర్ లెస్ యాక్టివ్ సబ్ ఉఫర్ తో జతగా అందించింది. ఈ సౌండ్ బార్ టోటల్ 430W అవుట్ పుట్ తో ఉంటుంది. అయితే, ఇందులో ఉఫర్ మరియు బార్ కెపాసిటీలు విడి విడిగా ఎంత ఉంటాయనే విషయాన్ని మాత్రమే వివరించలేదు. కానీ, బార్ లో 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు, 3 ట్వీటర్లు మరియు హెవీ బేస్ కోసం 6.5 ఇంచ్ ఉఫర్ ఉన్నట్లు వెల్లడించింది.
ఈ ఉఫర్ ఎటువంటి వైర్ అవసరం లేకుండా వైర్ లెస్ కనెక్షన్ తో వస్తుంది మరియు డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్. ఇది Music, Film, News మరియు Game వంటి నాలుగు Modes తో వస్తుంది. ఇక మైన్ సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇది సమర్ధవంతమైన మరియు పర్ఫెక్ట్ సినిమా అనుభవాన్ని అందించడానికి వీలుగా Dolby Audio మరియు DTS డ్యూయల్ డీకోడింగ్ టెక్నాలజీ ఇందులో అందించినట్లు కంపెనీ చెబుతోంది.
కానీ, ఈ Xiaomi 3.1SoundBar మార్కెట్లోకి ఎప్పటి వరకూ వస్తుంది మరియు దీని ధర ఎంత అనే విషయాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. Xiaomi భారతదేశంలో ఈ సౌండ్ బార్ ను విడుదల చేస్తుందో లేదో అనికూడా స్పష్టంగా తెలియలేదు.