Mi ఇండియా, తన సరికొత్త ఇయర్ ఫోన్స్ ని విడుదల చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ మీకు గొప్ప BASS మరియు క్రిస్పీ Treble అందించడంతో పాటుగా సూపర్ క్లారిటీ మ్యూజిక్ అందిస్తుంది. సాధారణంగా మనం వాడే సింగిల్ డ్రైవర్ మరియు ఈ డ్యూయల్ డ్రైవర్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ Mi డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ రెండు డ్రైవర్స్ తో వచ్చినా కూడా ధర మాత్రం తక్కువగానే ఉండడం విశేషంగా చెప్పొచ్చు. ఈ Mi డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ ని కేవలం రూ.799 ధరతో ప్రకటించింది.
Mi డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్ : ప్రత్యేకతలు
పైన తెలిపినట్లుగా, సాధారణంగా మనం వాడే సింగిల్ డ్రైవర్ మరియు ఈ డ్యూయల్ డ్రైవర్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే, మన వాడే సింగిల్ డ్రైవర్ (స్పీకర్) ఇయర్ ఫోన్స్ కేవలం ఒకే ఒక డ్రైవర్ తో వస్తాయి. అయితే, MI కొత్తగా ప్రకటించిన ఈ డ్యూయల్ డ్రైవర్ ఇయర్ ఫోన్స్, పేరు సుచినట్లుగానే రెండు స్పీకర్లతో వస్తాయి. ఇందులో, ఒక 10mm డ్రైవర్ (స్పీకరు) కు జతగా మరొక 8mm డ్రైవర్ వుంటుంది. తద్వారా, BASS మరియు Treble విడివిడిగా ప్రాసెసర్ చెయ్యబడి, మీకు గొప్ప BASS మరియు క్రిస్పీ Treble అందించడంతో పాటుగా సూపర్ క్లారిటీ మ్యూజిక్ అందిస్తుంది.
ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో మీకు Passive Noise Cancellation ఫీచర్ వుంటుంది కాబట్టి, బయట నుండి మీకు ఎటువంటి రణగొని ధ్వని లోపలి రాకుండా అడ్డుకుంటుంది. అలాగే, ఇందులో మీకు టాంగిల్ ఫ్రీ (చిక్కుపడని) బ్రైడెడ్ కేబుల్ ని కూడా అఫర్ చేస్తోంది. అధనంగా, ఇవి మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ కాబట్టి ఒకదానికొకటి అతికించవచ్చు. దీని వలన మీరు ఈ ఎయిర్ ఫోన్స్ ని మీ మెడలో సులభంగా తగిలించుకోవచ్చు. అలాగే, ఇద్న్హులో అందించిన మంచి మైక్రో ఫోనుతో కాలింగ్ సౌకర్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.